Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘హను-మాన్‌’ను ప్రకటించిన ప్రశాంత్‌ వర్మ

Webdunia
శనివారం, 29 మే 2021 (19:56 IST)
Hanuman poster
తెలుగుతెరపై సూపర్‌ హీరోస్‌ సినిమాలను ఈతరం ప్రేక్షకులు ఇప్పటివరకు చూసింది లేదు. ‘జాంబీరెడ్డి’ సినిమాతో జాంబీస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ మరోసారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చూట్టారు. తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్‌ జానర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సారి మరింత కొత్తగా, లార్జ్‌ స్కేల్‌లో ఈ చిత్రం ఉండబోతుంది అని తెలిపారు.
 
తన బర్త్‌ డే సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. సినిమాటిక్‌యూనివర్స్‌లో సూపర్‌హీరోస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉండనుంది. ఒరిజినల్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘హను–మాన్‌’ టైటిల్, మోషన్‌ పోస్టర్‌ను మే 29న విడుదల చేశారు.
 
మన పురాణాలు ఇతీహాసల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్‌హీరోస్‌ గురించి మనకు తెలుసు. వారి అపూర్వమైన శక్తులు, బలాలు, పోరాటపటిమ అద్భుతమైనవి.
 
హాలీవుడ్‌ను సూపర్‌హీరోస్‌ మూవీస్‌ రూల్‌ చేస్తున్నాయి. డిస్నీ, మార్వెల్‌ సూపర్‌హీరోస్‌ ఫిల్మ్స్‌ బాక్సాఫీసు వద్ద అద్భుతమైన కలెక్షన్స్‌ను రాబట్టాయి. ఇటీవల విడుదలైన సూపర్‌హీరో ఫిల్మ్‌ ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్ళను రాబట్టింది.
 
ఈ సూపర్‌హీరో ఫిల్మ్‌ జానర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. సూపర్‌హీరోస్‌ చిత్రాల్లోని హీరో ఎలివేషన్స్, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఆడియన్స్‌ను థియేటర్స్‌రకు రప్పిస్తాయి.
భారతీయ పురాణాల నుంచి ‘హను-మాన్' సినిమాకు స్ఫూర్తి పొందాము. భారతీయులుకు ‘హనుమాన్‌’ సూపర్‌హీరో. ఈ సినిమా టైటిల్‌లో హను మాన్ మధ్యలో వజ్రంతో ఉన్న సూర్యుడి లొగొ ఉండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది.
 
ఇప్పటికే విడుదలైన ‘హనుమాన్‌’ మోషన్‌ పోస్టర్‌ విజువల్‌ అద్భుతంగా ఉండి మంచి స్పందన లభిస్తుంది. మోషన్‌ పోస్టర్‌లోని హిమాలయాల విజువల్స్‌ అత్యద్భుతంగా, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్‌గా ఉంది. ‘హనుమాన్‌’ చిత్రం సరికొత్తగా ఉంటూ ఎగ్జైటింగ్ గా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments