నా హత్యకు కాంట్రాక్టులా? టెర్రరిస్టులు కూడా షాకవుతారు: రాంగోపాల్ వర్మ

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2023 (19:57 IST)
కర్టెసి-ట్విట్టర్
తన హత్యకు ఏకంగా ఓ టీవీలోనే కాంట్రాక్టులు ఇవ్వడం చూసి టెర్రరిస్టులు కూడా షాకవుతారని వ్యాఖ్యానించారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఓ టీవీ ఛానల్లో అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడు కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ... రాంగోపాల్ వర్మ తలను తెచ్చినవారికి కోటి రూపాయలు ఇస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వ్యూహం సినిమా గురించి మాట్లాడిన సందర్భంలో ఆయన చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై దర్శకుడు వర్మ ఈరోజు సాయంత్రం డిజిపికి ఫిర్యాదు చేసారు.
 
తనను హత్య చేసేందుకు బహిరంగంగా ఓ టీవీ ఛానల్లో కాంట్రాక్టు ఇచ్చినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తను చిత్రీకరించిన వ్యూహం సినిమాతో తెలుగుదేశం పార్టీ వణికిపోతోందనీ, ఇప్పటివరకూ తన హత్య కాంట్రాక్టు వ్యవహారం గురించి తెదేపా నాయకులు చంద్రబాబు, లోకేష్ స్పందించలేదనీ, పవన్ కల్యాణ్ కూడా మాట్లాడలేదంటే వాళ్ల ప్లాను కూడా తనను చంపేయడమే అయి వుండవచ్చని వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులోనూ ఎన్డీఏ కూటమి రాబోతోందా? సీఎం అభ్యర్థిగా టీవీకే చీఫ్ విజయ్?

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం

AI Hub: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభంపై ప్రధాని హర్షం

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి

పాకిస్థాన్ - ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments