గాజాలో తిష్టవేసిన హమాస్ తీవ్రవాదులను ఏరివేత కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ మరింత ఉధృతం చేసింది. దీంతో గాజా లక్ష్యంగా అన్ని రకాల దాడులు చేస్తుంది. దీంతో గాజా నగరం గజగజ వణికిపోతుంది. ఒక్క మంగళవారం నిర్వహించిన దాడుల్లో ఏకంగా 700 మంది చనిపోయారు. ఈ విషయాన్ని హమాస్ వైద్య విభాగం అధికారికంగా కూడా వెల్లడించింది. గత రెండు వారాలుగా ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్నప్పటికీ రోజువారీగా చూస్తే మంగళవారం నమోదైన మరణాలే అత్యధికమని వెల్లడించింది.
ఈ నెల 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హసామ్ ఉగ్రవాదులు రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారు. ఈ నరమేధానికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇజ్రాయెల్ దాడులతో గాజా నగరం అట్టుడుకిపోతుంది. ఫలితంగా మృతుల సంఖ్య కూడా నానాటికీ పెరిగిపోతున్నారు. మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులతో ఒక్క రోజే ఏకంగా 700 మంది మృత్యువాతపడ్డారు. హమాస్ వైద్యవిభాగం ఈ మేరకు ప్రకటన చేసింది.
రెండు వారాలుగా దాడులు కొనసాగుతున్నప్పటికీ రోజువారీగా చూస్తే మంగళవారం నమోదైన మరణాలే అత్యధికమని వెల్లడించింది. దయానక పరిస్థితులు నెలకొన్నాయని, సాయం అందాల్సిన ఆవశ్యకత ఉందని హమాస్ విచారం వ్యక్తం చేసింది. మొత్తం 400 హమాస్ లక్ష్యాలపై దాడులు చేశామని, డజన్ల కొద్ది ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. అయితే ఈ ఇస్లామిక్ గ్రూప్‌ను తుద ముట్టించడానికి మరింత సమయం పడుతుందని పేర్కొంది.