అంచనాలు పెంచుతున్న అప్సరా రాణి రాచరికం పోస్టర్

డీవీ
శుక్రవారం, 12 జనవరి 2024 (16:15 IST)
Racharikam poster
విజయ్ శంకర్ హీరోగా, అప్సరా రాణి హీరోయిన్‌గా ‘రాచరికం’ అనే చిత్రం రాబోతోంది. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే.
 
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. హీరోయిన్ అప్సరా రాణి పుట్టిన రోజు (జనవరి 12) సందర్భంగా రాచరికం మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే అప్పరా రాణికి అద్భుతమైన పాత్ర లభించినట్టుగా కనిపిస్తోంది. కాళీ మాత ఉగ్ర రూపం దాల్చితే, రక్తంతో ఒళ్లంతా తడిసి ముద్దైతే ఎలా ఉంటుందో.. ఈ పోస్టర్‌లో అప్సరా రాణి అలా ఉన్నారు. ఈ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో చిత్రయూనిట్ రానుంది.
 
ఈ చిత్రంలో విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.
 
ఈ మూవీకి వెంగి సంగీతాన్ని అందించగా.. ఆర్య సాయి కృష్ణ కెమెరా మెన్ గా పని చేశారు. ఈ సినిమాకు జేపీ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
 నటీనటులు : విజయ్ శంకర్, అప్సరా రాణి,  విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

బీహార్‌లో ఘోర పరాజయం.. రాజకీయాలకు బైబై చెప్పనున్న ప్రశాంత్ కిషోర్?

మావోయిస్టుల మాట విని యువత చెడిపోవద్దు : బండి సంజయ్ హితవు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments