Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోగ్గాడు శోభన్ బాబు ఏఐ అద్భుతం.. వీడియో వైరల్.. వర్మ ట్వీట్

Advertiesment
shoban Babu

సెల్వి

, శుక్రవారం, 12 జనవరి 2024 (14:21 IST)
shoban Babu
తెలుగు సినిమా చరిత్రలో దివంగత నటుడు శోభన్‌బాబు ఓ దిగ్గజం. "సోగ్గాడు" అని అందరూ ఆయనను ముద్దుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం ఆయన భౌతికంగా లేనప్పటికీ, తన టైమ్‌లెస్ సినిమాల ద్వారా జీవిస్తాడు. 
 
తాజాగా సోగ్గాడిపై ఏఐ పడింది. సెలెబ్రిటీల ఫోటోలను తన టెక్నాలజీతో అబ్బురపరిచే ఏఐ తాజాగా శోభన్ బాబును మరీ అందగాడిగా.. హాలీవుడ్ నటుడిలా రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యవ్వనంలో శోభన్ బాబు ఇలా వుంటాడని చిత్రీకరిస్తూ AI- రూపొందించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాడు. 
 
తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్‌లో ఈ చిత్రాలు, వీడియోల లింక్‌ను పంచుకున్నారు. ఇంకా వాటిని డిజిటల్ అద్భుతం అని పేర్కొన్నారు. "సోగ్గాడు" బీచ్‌లో స్లో మోషన్‌లో నడుస్తూ, చిలికిన సిక్స్ ప్యాక్ బాడీతో మోడ్రన్ లుక్‌తో ఈ వీడియోలో కనిపించాడు.
Shoban Babu


గోరింటాకు చిత్రంలోని కొమ్మ కొమ్మకో సన్నాయి అనే ఐకానిక్ పాటతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నట్లు వీడియో వర్ణిస్తుంది. శోభన్ బాబు తన నటనా ప్రయాణాన్ని 1959లో ప్రారంభించారు. ఆపై 1996 వరకు 230 చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Durga


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్‌తో నటించే ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? వరలక్ష్మి శరత్ కుమార్