హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువ జంట ఇష్టారీతిన ప్రవర్తించింది. రాత్రిపూట కారుపై
కూర్చొని వికృత చేష్టలకు పాల్పడింది. ముద్దూ ముచ్చట్లలో మునిగిపోయింది. రాత్రి పూట కారులో విహరిస్తూ కారు రూఫ్‌పై కూర్చొని ఈ పాడు పనులకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు వీపీ ఎక్స్‌ప్రెస్‌పై కనిపించాయి. శంషాబాద్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే పీవీ ఎక్స్‌ప్రెక్ వంతెనపై కారుపైనే కూర్చొని ముద్దులు పెట్టుకున్నారు.
రోడ్లపై తిరుగుతున్నామనే విషయాన్ని కూడా మరచిపోయి కౌగిలించుకొని విన్యాసాలు చేస్తూ ప్రమాదకర రీతిలో ప్రయాణించారు. ఈ ముద్దుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిని చూసిన నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనుకోని ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యతని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే యువతులతో కలిసి ప్రమాదకర రీతిలో స్టంట్స్ చేస్తూ కొందరు యువకులు.. రాజధాని రహదారులపై బెంబేలెత్తించిన విషయం తెలిసిందే.