Apsara rani, Vijay Shankar, clap Raj kandukuri
విజయ్ శంకర్ హీరోగా, అప్సరా రాణి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం రాచరికం. ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తు దర్శకత్వాన్ని వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా.. నిర్మాత డీఎస్ రావు కెమెరా స్విస్ ఆన్ చేశారు. నిర్మాత ఈశ్వర్ స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ చిత్రానికి వెంగి సంగీతాన్ని అందించగా.. ఆర్య సాయి కృష్ణ కెమెరా మెన్ గా పని చేశారు. ఈ మూవీకి జేపీ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ, చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ మీద రాచరికం అనే సినిమాను తీస్తున్నాము. ఈ మూవీ గ్లింప్స్ ప్రస్తుతం మంచి రెస్సాన్స్ దక్కించుకుంది. గ్లింప్స్‌లో వెంగి ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఇకపై కంటిన్యూగా అప్డేట్లు ఇస్తుంటాం. నాకు సహకరించిన టీంకు థాంక్స్. ఈ రోజు మా ఈవెంట్‌కు గెస్టులుగా వచ్చిన రాజ్ కందుకూరి, డీఎస్ రావులకు థాంక్స్ అని అన్నారు.
నిర్మాత ఈశ్వర్ మాట్లాడుతూ, దర్శకుడు సురేష్‌తో ఆరు నెలలుగా ప్రయాణించాం. సినిమా అద్భుతంగా వస్తుంది అనే నమ్మకం ఉంది. గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ మూవీ తరువాత పనిచేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది అని అన్నారు.
విజయ్ శంకర్ మాట్లాడుతూ, టైటిల్ రివీల్ చేసినప్పటి నుంచీ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. మా టైటిల్ చూసి బోయపాటి శ్రీను గారు పర్సనల్‌గా మెసెజ్ పెట్టారు. సురేష్ గారి ప్యాషన్ ఈ మూవీతో అందరికీ తెలుస్తుంది. గత ఏడు నెలలుగా దర్శక నిర్మాతలు ఈ మూవీ మీదే ఫోకస్ పెట్టారు. ఇలాంటి మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన వారికి థాంక్స్. వారి నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. అప్సరా గారు ఆర్జీవీ సినిమాతో ఫేమస్ అయ్యారు. ఇందులో ఆమె చాలా కొత్తగా కనిపిస్తారు. మేం రెట్రో లుక్‌లో కనిపిస్తాం. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ దీని గురించే మాట్లాడుకుంటారు అని అన్నారు.
అప్సరా రాణి మాట్లాడుతూ, చిల్ బ్రోస్ సంస్థ నన్ను ఈ పాత్ర కోసం అప్రోచ్ అయింది. కథ విన్నప్పుడే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని నమ్మాను. ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. రాచరికంతో అరాచకం సృష్టించబోతున్నామని అన్నారు.
ప్రాచీ థాకర్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో విప్లవ అనే పాత్రను పోషించాను. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా సినిమాను అందరూ ప్రోత్సహించండి అని అన్నారు.
విజయ రామరాజు మాట్లాడుతూ, ఈ చిత్రంలో నేను నెగెటివ్ పాత్రలో కనిపిస్తాను. ఈ కథను, పాత్రను దర్శకుడు నాకు చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపిచించింది. మా యంగ్ ప్రొడ్యూసర్స్ చాణక్య, కిరణ్‌లకు పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
ఈ చిత్రంలో విజయ్ శంకర్, అప్సరా రాణి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.
నటీనటులు : విజయ్ శంకర్, అప్సరా రాణి, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు