Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిహారిక కొణిదెల ప్రధాన పాత్రలో వాట్ ది ఫిష్ - ఫస్ట్ లుక్

Advertiesment
What the Fish, Niharika Konidela
, సోమవారం, 18 డిశెంబరు 2023 (16:45 IST)
What the Fish, Niharika Konidela
నిహారిక కొణిదెల 'వాట్ ది ఫిష్‌' తో కమర్షియల్‌ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఇందులో నిహారిక ప్రధాన పాత్ర పోషిస్తోస్తున్నారు. వరుణ్ కోరుకొండ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. 'వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజియర్' అనేది సినిమా ట్యాగ్‌లైన్.  
 
'వాట్ ది ఫిష్' అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. 6ix సినిమాస్‌పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నిహారిక స్టైలిష్‌గా నడుస్తూ కనిపించారు. తన వెనుక డాలర్ ఇమేజ్‌ వుంది. నిహారిక ఎలిగెంట్అవతార్‌లో మెరిసే వస్త్రధారణతో ఆకట్టుకున్నారు.
 
ఆమె పాత్ర అష్టలక్ష్మి అకా ఏయస్ హెచ్. ఈ పాత్రని చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. తెలుగు సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్, యాక్షన్- డ్రివెన్ పాత్ర. ఆమె పాత్ర ప్రేక్షకులని అద్భుతంగా అలరించబోతుందని దర్శకుడు చెప్పారు.
 
ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తుండగా, సూర్య బెజవాడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
 
వివిధ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా సామిరంగ కోసం నాగార్జున అక్కినేనితో స్నేహితులుగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్