Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానం రద్దు - ఆ ఒక్క ఫోన్ కాల్‌తో ఆగిపోయిందా?

Advertiesment
pawan kalyan
, శుక్రవారం, 24 నవంబరు 2023 (18:35 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రయాణించాల్సిన ప్రత్యేక విమానం ఆగిపోయింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందంటూ ఆయన హైదరాబాద్ నగరం నుంచి ప్రయాణించాల్సిన విమానాన్ని బేగంపేట ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. విమానంలో సాంకేతిక లోపం ఉందని సీఐడీ అధికారి ఫోన్ చేశారంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జగన్ ఎన్ని కుట్రలు చేసినా పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంకు చేరుకుంటారని తెలిపారు. 
 
ఇటీవల వైజాగ్ ఫిషింగ్ హార్బరులో జరిగిన అగ్నిప్రమాదంలో అనేక మంది జాలర్లు తమకు జీవనోపాధిని కల్పించే పడవలను కోల్పోయారు. దాదాపు 40కి పైగా పడవలు బుగ్గిపాలయ్యాయి. వీరిని ఏపీ ప్రభుత్వం ఆదుకోలేదు. దీంతో పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చిన పడవలు కాలిపోయిన జాలర్లకు రూ.50 వేలు చొప్పున సొంత డబ్బులతో ఆర్థికసాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందుకోసం ఆయన శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోవాల్సి వుంది. 
 
అయితే, చివరి నిమిషంలో ఆయన ప్రయాణించాల్సిన విమానం ఆగిపోయింది. ఈ ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం ఉందంటూ ఓ సీఐడీ అదికారి చెప్పడంతో ఎయిర్‌పోర్టు అధికారులు విమానాన్ని నిలిపివేసినట్టు తమకు సమాచారం వచ్చిందని జనసేన నేత కేవీఎస్ రాజు ఆరోపించారు. అయితే, జగన్ ఎన్ని కుట్రలు చేసినా పవన్ విశాఖకు రావడం ఖాయమన్నారు. ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద బాధితులకు పవన్ నష్టపరిహారం అందిస్తారని చెప్పారు. 

27న బంగాళాఖాతంలో వాయుగుండం  
 
బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు నెలకొనివున్నాయని భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రం వెల్లడించింది. ఈ నెల 27వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకునివుని అల్ప పీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఈ నెల 29వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. ఇది తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్టు ప్రైవేటు వాతావరణ సంస్థలు వెల్లడించాయి. 
 
ప్రస్తుతానికి దక్షిణ అండమాన సముద్రం పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఐఎండీ వివరించింది. అటు గడిచిన 24 గంటసల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. తమిళనాడులోని మేట్టుపాళెయంలో అత్యధికంగా 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేగంగా వ్యాపిస్తున్న H9N2: మన పిల్లలకి ఇబ్బంది లేదు