Anuksha: అనుష్క శెట్టి సోషల్ మీడియాకూ దూరం, ఘాటీ చిత్రం రిజల్ట్ కారణమా..

దేవీ
శుక్రవారం, 12 సెప్టెంబరు 2025 (17:51 IST)
Anushka Shetty
దర్శకుడు క్రిష్, అనుష్క శెట్టి కాంబినేషన్ లో వచ్చిన ఘాటీ సినిమా ఫలితం తెలిసిందే. ఆ చిత్రాన్ని దర్శకుడు సరిగ్గా తీయలేకపోయాడనీ, అనుష్క అసలు పబ్లిసిటీకి రాలేదని ఇదేమా ఆమె నేర్చుకుంది అంటూ సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ప్రచారాలు జరిగాయి. క్రిష్ స్టామినీ తగ్గిందనీ, అందుకు నిదర్శనం హరిహరమీరమల్లు చిత్రమే కారణంగా మరికొందరు పేర్కొన్నారు. 
 
ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో చేతిరాతతో రాసిన ఒక నోట్‌ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. బ్లూ లైట్ నుంచి క్యాండిల్ లైట్‌కు మారుతున్నా. స్క్రోలింగ్‌కు అతీతంగా ఉన్న ప్రపంచంతో, మనం నిజంగా మొదలైన చోటుతో తిరిగి కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియా నుంచి కొంతకాలం తప్పుకుంటున్నాను అని అనుష్క తన నోట్‌లో పేర్కొన్నారు. మరిన్ని కథలతో, మరింత ప్రేమతో త్వరలోనే మళ్లీ కలుస్తానని, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని అభిమానులకు సందేశమిచ్చారు.
 
ఘాటి సినిమా ఫలితంపై సినిమా ఇండస్ట్రీ కూడా పెద్దగా స్పందించలేదు. దానితో కూడా దర్శకుడు క్రిష్ కొంచెం నిరాశకు గురయినట్లు తెలుస్తోంది. కాగా, సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె మాట్లాడినట్లు ఆడియో విడుదలైంది. అందులో నాకు పూర్తి స్థాయి నెగెటివ్ పాత్ర చేయాలని ఉంది. బలమైన కథ వస్తే తప్పకుండా విలన్‌గా నటిస్తాను అని చెప్పింది. త్వరలో మరో కథతో వస్తున్నట్లు చెబుతూ.. కొద్ది కాలం సోషల్ మీడియాకు దూరంగా వున్నట్లు చెబుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి రెండేళ్లు పట్టే అవకాశం..

డిసెంబర్ 4 నుండి రెండు రోజుల పాటు భారత పర్యటనలో పుతిన్

మా ఫ్రెండ్స్‌తో ఒక్క గంట గడిపి వాళ్ల కోర్కె తీర్చు, ఏపీ మహిళా మంత్రి పీఎ మెసేజ్: మహిళ ఆరోపణ (video)

అమరావతి నిర్మాణానికి భూములిచ్చి రైతులు త్యాగం చేశారు.. నిర్మలా సీతారామన్

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments