Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శెట్టి 'నిశ్శ‌బ్ధం' టీజ‌ర్ రిలీజ్ చేసిన పూరి, ఇంత‌కీ టీజ‌ర్ టాక్ ఏంటి?

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (17:57 IST)
అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`. ఈ చిత్రంలో అనుష్క మాట్లాడ‌లేని సాక్షి అనే అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తున్నారు. 
గురువారం(న‌వంబ‌ర్ 7న‌) అనుష్క పుట్టిన‌రోజుఈ సంద‌ర్భంగా `నిశ్శ‌బ్దం` టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌మిళం, మ‌ల‌యాళ టీజ‌ర్స్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ విడుద‌ల చేయ‌గా.. హిందీ టీజ‌ర్‌ను స్టార్ డైరెక్ట‌ర్ నీర‌జ్ పాండే విడుద‌ల చేశారు.
 
ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, ప్రీ-టీజ‌ర్ సినిమాపై అంచనాల‌ను పెంచ‌గా, ఇప్పుడు విడుదలైన టీజ‌ర్ ఈ అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ క్రాస్ ఓవ‌ర్ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.  త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌నుంది.
 
ఈ చిత్రంలో మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజ్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల, మైకేల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇందులో మాధ‌వ‌న్‌, అంజ‌లి లుక్స్‌ను చిత్ర యూనిట్ రీసెంట్‌గా విడుద‌ల చేసింది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పనితీరులో అగ్రస్థానం.. కానీ ర్యాంకుల్లో పవన్ కళ్యాణ్‌కు పదో స్థానం.. ఎందుకని?

Begumpet Airport: ల్యాండ్ అవుతూ అదుపు తప్పిన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ (video)

హైదరాబాద్ నుండి విజయవాడకు మొదటి ఫ్లిక్స్‌బస్ ఇండియా ఎలక్ట్రిక్ బస్సు

Chennai Auto: ఆటోలో యువతి కిడ్నాప్-పోలీసులు వెంబడించాక రోడ్డుపై తోసేశారు.. ఇద్దరు అరెస్ట్

చంద్రబాబు పేరు ఉచ్ఛరించడమే ఇష్టంలేదన్న మంగ్లీకి టీడీపీ నేతల సలాం... ఎందుకో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments