Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుష్క శెట్టి చేసిన ఆ పనికి పూరీ జగన్నాథ్ షాక్ అయ్యాడట (Video)

Advertiesment
Puri Jagannath
, గురువారం, 7 నవంబరు 2019 (15:18 IST)
అనుష్క శెట్టి... ఈ పేరు చెప్పగానే మనకు అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాలు గుర్తుకు వస్తాయి. నిజానికి అనుష్క శెట్టి సినిమాల్లోకి కావాలని రాలేదు. అనుకోకుండా ఈ ఫీల్డులోకి వచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకున్నది ఈ భామ. అనుష్క సినిమాల్లో పాత్ర మేరకు ఎలా కావాలంటే అలా కన్పిస్తుంది కానీ బయట మాత్రం చాలా పద్ధతిగా వుంటుంది. సినిమా ఫంక్షన్లకు సంప్రదాయపద్ధతిలో దుస్తులు వేసుకుని వస్తుంటుంది.
 
ఇక అసలు విషయానికి వస్తే, అనుష్క శెట్టి మొదట్లో సినీ అవకాశం ఇచ్చేందుకు పూరీ జగన్నాథ్, ఏదయినా ఫోటో వుంటే ఇవ్వమని అడిగారట. దాంతో వెంటనే తన పర్సులో వున్న ఓ పాస్ పోర్ట్ సైజు ఫోటోను చటుక్కున ఆయన చేతిలో పెట్టిందట. అంతే, పూరీ 'సూపర్' అంటూ పగలబడి నవ్వారట. పక్కనే వున్న నాగార్జున కూడా నవ్వుతూ, ఫోటో అంటే అది కాదంటూ ఫోటో సెషన్ ఏర్పాటు చేసి ఆ ఫోటోలను పంపారట పూరీకి.
 
అనుష్క మొదటి ఫోటోతో సూపర్ అంటూ పూరీ చెప్పినట్లుగానే అనుష్క శెట్టి అప్పటి నుంచి ఇప్పటివరకూ సూపర్‌గా దూసుకుపోతోంది. అదీ సంగతి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర‌జినీకాంత్ ద‌ర్బార్ పోస్ట‌ర్‌ను ఎవ‌రు రిలీజ్ చేయ‌నున్నారో తెలుసా?