Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన రేటును బాగా పెంచేసిన అందాల భామ అనుష్క...

వరుస హిట్లతో తెలుగు సినీపరిశ్రమలో అగ్రహీరోయిన్ల స్థానంలో ఉంది అనుష్క. ఇప్పటివరకు ఏ హీరోయిన్‌కు అందని రెమ్యునరేషన్ అనుష్కకు అందుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 కోట్ల రూపాయలు.

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (11:23 IST)
వరుస హిట్లతో తెలుగు సినీపరిశ్రమలో అగ్రహీరోయిన్ల స్థానంలో ఉంది అనుష్క. ఇప్పటివరకు ఏ హీరోయిన్‌కు అందని రెమ్యునరేషన్ అనుష్కకు అందుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 కోట్ల రూపాయలు. మీరు చదువుతున్నది నిజమే. 'బాహుబలి' 1, 2 భారీ విజయాల తర్వాత "భాగమతి" సినిమాకు కూడా అనుష్క 5 కోట్ల రూపాయలను నిర్మాత దగ్గర నుంచి వసూలు చేశారట. భాగమతి సినిమా కూడా భారీ విజయాన్ని సాధించడంతో ఇక అనుష్క తన రేటును బాగా పెంచేసింది. 
 
ఇప్పుడు ఏ నిర్మాత వెళ్ళి అనుష్కను కలిసినా వెంటనే 6 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందట. మొహమాటమనేది అస్సలు లేకుండా అడ్వాన్స్‌లోనే అగ్రిమెంట్ రాసుకోవాలని చెప్పేస్తోందట. అనుష్కకు ఉన్న క్రేజ్‌తో ఇక నిర్మాతలు కూడా సరేనని తలూపేస్తున్నారు. తెలుగు సినీపరిశ్రమ ఒక్కటే కాదు.. అటు తమిళ సినీపరిశ్రమలో కూడా అనుష్క తీసుకునేంత రెమ్యునరేషన్ మరెవరూ తీసుకోవడం లేదట. 
 
తమిళ సినీపరిశ్రమలో ఉన్న అగ్ర నటి త్రిష 2 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకుంటోంది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా కోటి రూపాయలు, హన్సిక కోటి రూపాయలతో సరిపెట్టుకుంటోంది. అనుష్క సినిమాలు మరికొన్ని హిట్టయితే ఖచ్చితంగా ఆమె రేటు మరింత పెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సిరియాలో చెలరేగిన అల్లర్లు - 745 మంది అమాయక పౌరులు మృతి

భారత్‌కు పొంచివున్న యుద్ధ ముప్పు - ఆ రెండు దేశాల కుట్ర : ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

అమరావతి - శ్రీకాకుళంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు!

బంగారం అక్రమ రవాణా కేసు : నటి రన్యారావు సీబీఐ కేసు

తన ఆస్తులు విలువ రూ.70 కోట్లు ... క్రిమినల్ కేసులు లేవు : నటుడు నాగబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments