Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ ఎఫెక్ట్ : రాంగోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్టు ఖాయమని హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా, ఆర్జీవీ నిర్మించిన గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) సినిమా వ్యవహారంలో ఆయనను హైద

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (09:43 IST)
టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్టు ఖాయమని హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా, ఆర్జీవీ నిర్మించిన గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) సినిమా వ్యవహారంలో ఆయనను హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేయవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
వివాదాస్పద ఇంటర్నెట్‌ చిత్రం 'గాడ్‌ సెక్స్‌ ట్రూత్‌' వివాదంపై ఇప్పటికే ఆయనను పోలీసులు ఒకసారి పిలిపించి మాట్లాడారు. మూడున్నర గంటల పాటు కొనసాగిన విచారణలో వర్మ తనదైనశైలిలో సమాధానాలు దాటవేశారు. స్కైప్‌ ద్వారా వీడియోను చిత్రీకరించినట్లు ఆయన చెప్పినట్లు సమాచారం. వర్మ తమను తప్పుదోవ పట్టించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. 
 
విచారణ అనంతరం వర్మ ట్విట్టర్‌ వ్యాఖ్యలను కూడా పోలీసులు సీరియ్‌స్‌గా పరిగణిస్తున్నారు. శుక్రవారం మలిదఫా విచారణకు వర్మ హాజరు కావాల్సి ఉండగా సోమవారం వస్తానంటున్నారు. వర్మ సమాధానాలపై అనుమానాలు ఉన్నాయని, నివృత్తి చేసుకోవడానికి రెండోసారి పిలిచామని చెప్పారు. 
 
విదేశాల్లో చిత్రీకరించారంటున్న జీఎస్టీని ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకొని, తిరిగి అప్‌లోడ్‌ చేసిన విషయంలో వర్మ దొరికిపోయాడని, రెండో దశ విచారణ అనంతరం ఆయనను అరెస్ట్‌ చేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టేఫ్రీ- మెన్స్ట్రుపీడియా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ, 10 లక్షలకు పైగా బాలికలకు అవగాహన

Pawan Kalyan Meets Chandrababu: బాబుతో పవన్ భేటీ.. వైఎస్సార్ పేరు తొలగింపు

AP Assembly Photo Shoot: పవన్ గారూ ఫ్రెష్‌గా వున్నారు.. ఫోటో షూట్‌కు హాజరుకండి: ఆర్ఆర్ఆర్ (video)

Roja: తప్పు మీది కాదు.. ఈవీఎంలదే.. కూటమి సర్కారుపై సెటైర్లు విసిరిన ఆర్కే రోజా

కాలేజీ ప్రొఫెసర్ కాదు కామాంధుడు.. విద్యార్థుల పట్ల అలా ప్రవర్తించి.. పోలీసులకు చిక్కాడు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం