జెమినీ గణేశన్‌తో పెళ్లి వద్దంటే సావిత్రి వినలేదు: మహానటిపై జమున
అలనాటి సావిత్రి గురించి ''మహానటి'' సినిమా చేస్తూ.. ఆమెను గురించిన వివరాలేవీ తన వద్ద అడగలేదని.. అలనాటి హీరోయిన్ జమునా వాపోయారు. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న సావిత్రి బయోపిక్ ప్రస్తుతం షూ
అలనాటి సావిత్రి గురించి ''మహానటి'' సినిమా చేస్తూ.. ఆమెను గురించిన వివరాలేవీ తన వద్ద అడగలేదని.. అలనాటి హీరోయిన్ జమునా వాపోయారు. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న సావిత్రి బయోపిక్ ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న నేపథ్యంలో.. సావిత్రి తాను అక్కాచెల్లెళ్లుగా వుండే వాళ్లమని జమునా వెల్లడించారు.
జెమినీ గణేశన్‌తో వివాహం వద్దని ఎంతమంది వారించినా ఆమె వినిపించుకోలేదని.. ఆమె అనారోగ్య సమయంలో అమెరికా పంపించడానికి ఎంతగానో ప్రయత్నించానని జమున చెప్పుకొచ్చారు. సావిత్రి గురించి బాగా తెలిసిన తన వద్ద ఆమె బయోపిక్ తీస్తున్నప్పుడు ఒక్కరూ తన సలహాలు అడగలేదని జమునా తెలిపారు.
తెలుగు భాష తెలియనివాళ్లు సావిత్రి పాత్రను పోషిస్తుండటం మరీ ఆశ్చర్యపోవాల్సిన విషయమని జమున అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంతోమంది నుంచి సావిత్రికి సంబంధించిన సమాచారం సేకరించామని నాగ్ అశ్విన్ చెబుతుండగా, జమున ఇలా తన వద్ద ఎలాంటి సంప్రదింపులు జరుపలేదని కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇకపోతే.. మహానటిలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తోంది. అలాగే, టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ అనుష్క కూడా ఇందులో కీలకమైన పాత్రను పోషించనుంది. అలనాటి నటి భానుమతి పాత్రలో 'భాగమతి' అనుష్క శెట్టి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వీరితో పాటు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, విక్రమ్ ప్రభు, షాలిని పాండే, మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే జమున పాత్రలో సమంత కనిపించనుందని సినీ యూనిట్ వర్గాల సమాచారం.