Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దగ్గుబాటి రానా 'గజదొంగ'

విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాల్లో నటించేందుకు అందరికంటే ముందుండే హీరో దగ్గుబాటి రానా. తనకంటూ క్యారెక్టర్ నచ్చితే ప్రతినాయకుడిగానైనా నటించేందుకు ఏమాత్రం వెనుకాడడు. ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బ

Advertiesment
దగ్గుబాటి రానా 'గజదొంగ'
, గురువారం, 25 జనవరి 2018 (13:26 IST)
విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాల్లో నటించేందుకు అందరికంటే ముందుండే హీరో దగ్గుబాటి రానా. తనకంటూ క్యారెక్టర్ నచ్చితే ప్రతినాయకుడిగానైనా నటించేందుకు ఏమాత్రం వెనుకాడడు. ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' చిత్రంలో విలన్‌గా నటించి ప్రతి ఒక్కరి మన్నలు, ప్రశంసలు పొందారు. 
 
అంతేకాదండోయ్.. హిస్టారికల్ అయినా ఫాంటసీ అయినా లేదా డిఫరెంట్ జోనర్ అయినా సరే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు రానా. అతనే ది బెస్ట్ అంటూ పలువురు దర్శకులు ఇప్పటికే కితాబిచ్చారు కూడా. తాజాగా అలాంటి మరో సబ్జెక్ట్‌కు రానా ఓకే చేసినట్టు సమాచారం. 
 
1970వ దశకంలో తన దొంగతనాలతో తెలుగు రాష్ట్రాన్ని వణికించిన 'గజదొంగ' టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో నటించేందుకు రానా సిద్ధమయ్యాడని సమాచారం. స్టూవర్టుపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఇళ్లు, దుకాణాలను చాకచక్యంగా లూటీ చేయడంలో సిద్ధహస్తుడు. 
 
ఆ కాలంలోనే తిరుపతి, వైజాగ్, కాళహస్తి, హైదరాబాద్ వంటి పట్టణాల్లో నాగేశ్వరరావుపై లెక్కలేనన్ని కేసులు నమోదయ్యాయి కూడా. ఆ తర్వాత 1987లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో టైగర్ నాగేశ్వరరావు హతమయ్యాడు. ఇప్పుడు ఈ కథతోనే రానా హీరోగా సినిమా రాబోతుందని టాక్. వంశీకృష్ణ దర్శకత్వంలో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమించుకున్నవారంతా పెళ్లిపీటలెక్కడం లేదు : కాజల్ అగర్వాల్