Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయాల్లో రజనీ, పవన్ రాణిస్తారు: రానా కామెంట్

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ తమిళ రాజకీయ బరిలోకి దిగనున్నారు. వీరిద్దరి క్రేజ్ భారీ స్థాయిలో వుండగా.. 2019 ఎన్నికల్లో రజనీ, కమల్ హాసన్‌ల మధ్యే పోరు వుంటుందని రాజకీయ పండితులు వి

రాజకీయాల్లో రజనీ, పవన్ రాణిస్తారు: రానా కామెంట్
, బుధవారం, 24 జనవరి 2018 (17:40 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ తమిళ రాజకీయ బరిలోకి దిగనున్నారు. వీరిద్దరి క్రేజ్ భారీ స్థాయిలో వుండగా.. 2019 ఎన్నికల్లో రజనీ, కమల్ హాసన్‌ల మధ్యే పోరు వుంటుందని రాజకీయ పండితులు విశ్లేషకులు అంటున్నారు. తాజాగా బాహుబలి భల్లాలదేవుడు రానా కీలక వ్యాఖ్యలు చేశాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లు రాజకీయాల్లో రాణిస్తారని రానా వ్యాఖ్యానించాడు.
 
సినిమా కళాకారులు ఏ రంగంలోనైనా రాణిస్తారని.. అలాగే రజనీకాంత్, పవన్ కల్యాణ్ రాజకీయాల్లో రాణిస్తారని చెప్పారు. వారిద్దరూ లెజెండ్స్ అంటూ కితాబిచ్చారు. ప్రజలను ప్రభావితం చేయగల శక్తి వారికుందని చెప్పుకొచ్చారు. ఇక తానైతే సినిమాల్లో రాజకీయ నాయకుడి పాత్రల్లో కనిపిస్తాను కానీ.. నిజజీవితంలో రాజకీయాలకు దూరంగా ఉంటానని రానా క్లారిటీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#RangasthalamTeaser చిట్టిబాబుగా చెర్రీ అదరగొట్టేశాడు (వీడియో)