Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీరు గాయపడితే చూడలేను.. ప్లీజ్ అర్థం చేసుకోండి : ఫ్యాన్స్‌కు పవన్ వినతి

తన అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ విజ్ఞప్తి చేశారు. మీరు గాయపడితే నేను తట్టుకోలేనని, ప్లీజ్ అర్థం చేసుకోవాలంటూ ఆయన ప్రాధేయపడ్డారు.

Advertiesment
మీరు గాయపడితే చూడలేను.. ప్లీజ్ అర్థం చేసుకోండి : ఫ్యాన్స్‌కు పవన్ వినతి
, బుధవారం, 24 జనవరి 2018 (11:39 IST)
తన అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ విజ్ఞప్తి చేశారు. మీరు గాయపడితే నేను తట్టుకోలేనని, ప్లీజ్ అర్థం చేసుకోవాలంటూ ఆయన ప్రాధేయపడ్డారు. ప్రజా సమస్యల అధ్యయనం కోసం పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ తొలిదశ పర్యటన మంగళవారంతో ముగియనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పర్యటన ముగించుకుని ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. 
 
అయితే, తన అభిమానులకు జనసేనాని పవన్ కల్యాణ్ విన్నపం చేశారు. ప్రజాయాత్రలో భాగంగా అభిమానులను కలవడం కుదరడం లేదని, దీనిని వారు దయచేసి అర్థం చేసుకోవాలని కోరారు. కొత్తగూడెం నుంచి ఖమ్మం బయల్దేరి వెళ్తూ, కరీంనగర్‌లో బస చేసిన హోటల్ వద్దకు భారీ ఎత్తున పవన్‌ను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు చేరుకోవడంతో చోటుచేసుకున్న సంఘటనలు గుర్తుచేసుకున్న ఆయన, అభిమానులు గాయపడితే తాను బాధపడతానని చెబుతూ, తాను ప్రతి ఒక్కరినీ కలవడం ప్రస్తుతం కుదరదని, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చానన్న విషయం అభిమానులు గుర్తించాలని ఆయన సూచించారు. 
 
ఇదిలావుంటే, కొత్తగూడెం పారిశ్రామికంగా అనువైన ప్రాంతమని పవన్ కల్యాణ్ అన్నారు. ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి శ్రీజ… మళ్లీ తతను కలవటం సంతోషంగా ఉందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సీఐ అక్రమ సంబంధం' : అనిశా ఏఎస్పీ సునీతారెడ్డిపై వేటు