Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

చిత్రాసేన్
శుక్రవారం, 24 అక్టోబరు 2025 (12:50 IST)
Anirudh - Mario
నాటకం, తీస్ మార్ ఖాన్ వంటి డిఫరెంట్ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మారియో తో మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఎ టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్.. అనే ట్యాగ్‌లైన్‌తో హీరో అనిరుధ్, హీరోయిన్ హెబ్బా పటేల్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
 
ఇక ఇప్పుడు ఈ మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్‌గా కమర్షియల్ జానర్‌లో వస్తూనే.. కంటెంట్ ఓరియెంటెడ్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా, ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది.
 
సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో 'మారియో' చిత్రాన్ని నిర్మిస్తుండగా రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతాన్ని అందిస్తున్నారు. పాటలు, మాటలు రాకేందు మౌళి సమకూరుస్తున్నారు. కథ, సంభాషణలను అభివృద్ధి చేయడంలో రాకేందు మౌళి కూడా గోగణకు మద్దతు ఇచ్చారు. MN రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మణికాంత్, మదీ మన్నెపల్లి ఎడిటర్లుగా వ్యవహరిస్తున్నారు.
 
తారాగణం: అనిరుధ్, హెబా పటేల్, రాకేందు మౌళి, మౌర్య సిద్ధవరం, యష్నా ముతులూరి, కల్పిక గణేష్, మదీ మన్నెపల్లి, లతా రెడ్డి తదితరులు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్థానిక సంస్థల్లో పోటీ- ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ

విద్యార్థులకు శుభవార్త చెప్పిన టి విద్యాశాఖ.. ఫీజుల చెల్లింపులపై క్లారిటీ

కర్నూలు బస్సు ప్రమాదం.. అగ్నికీలల్లో కుటుంబ సభ్యులంతా సజీవదహనం

Palle Panduga 2.0: గ్రామాభివృద్ధికి ఆర్థిక స్థిరత్వం కీలకం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments