Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

చిత్రాసేన్
శుక్రవారం, 24 అక్టోబరు 2025 (12:37 IST)
Ratika - XY
రతిక ప్రధాన పాత్రలో సి.వి. కుమార్ తెరకెక్కించిన చిత్రం ఎక్స్ వై. డిఫరెంట్ కంటెంట్‌తో రాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే ఇదొక ప్రయోగాత్మక చిత్రమని అర్థం అవుతోంది. కథ ఏంటి? బ్యాక్ డ్రాప్ ఏంటి? అన్న విషయాల్ని రివీల్ చేయకుండా అందరిలోనూన ఆసక్తిని పెంచేలా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
 
సి.వి. కుమార్ ఎప్పుడూ కూడా పిజ్జా, సూదు కవ్వుమ్, అట్టకత్తి, శరభం, ఇరుది సుట్రు, మాయావన్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే ఉంటారు. దర్శక, నిర్మాతగా సి.వి. కుమార్ మరోసారి ‘ఎక్స్ వై’ అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌లో కనిపించిన టీ పోసే బౌల్, కెమెరా, మెదడు, డీఎన్ఏ, ఆ తరువాత రాక్షసుడిలా ఓ రూపాన్ని చూపించడం, ఆపై హీరోయిన్ లుక్ చూపించడం, అక్కడ చుట్టూ గర్భంలో ఉన్న శిశువుల్ని చూస్తుంటే ఇదొక డిఫరెంట్ అండ్ న్యూ కంటెంట్ మూవీ అని అర్థం అవుతోంది.
 
తెలుగు, తమిళ్, మలయాళం ఇలా అన్ని భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ కృష్ణ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకి హరిహరణ్ ఆనందరాజ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర వివరాల్ని ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరూర్‌ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

తుఫాను ప్రారంభమైంది... భూమిని సమీపించే కొద్దీ తీవ్రమవుతుంది.. ఏపీఎస్డీఎంఏ

ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తున్న యువతిని కాటేసిన పాము.. మూడు ముక్కలైనా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments