Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుట్ట బొమ్మ గా అనిక సురేంద్రన్

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (09:25 IST)
Anika Surendran
వరుస చిత్రాల నిర్మాణం లోనే కాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన 'సితార ఎంటర్ టైన్ మెంట్స్' ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి నిర్మిస్తున్న మరో  చిత్రం ప్రచార పర్వం వినాయక చవితి పర్వదినాన  మొదలైంది. వివరాల్లోకి వెళితే.....
 
అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు నాయిక, నాయకులుగా 'సితార ఎంటర్ టైన్ మెంట్స్' ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా  ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి "బుట్ట బొమ్మ" అనే పేరును ఖరారు చేస్తూ వినాయకచవితి పర్వదినాన చిత్రం పేరుతో ప్రచార చిత్రం ను విడుదల చేశారు. నాగ‌వంశీ ఎస్‌. - సాయి సౌజ‌న్య‌ ఈ చిత్రానికి నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు.
 
విడుదలైన ప్రచార చిత్రంలో నాయిక అనిక సురేంద్రన్ ‘బుట్ట బొమ్మ‘ గా ఎంతో అందంగా ఒదిగిపోయిన వైనం చూడ ముచ్చటగా ఉందనిపిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ...‘బుట్ట బొమ్మ‘ గా అనిక సురేంద్రన్, అలాగే అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల పాత్రలు గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ లో సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. గుర్తుండి పోతాయి.‘ప్రేమ' లోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి అని తెలిపారు.. సంభాషణల రచయిత గా ‘ వరుడు కావలెను‘ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గణేష్ కుమార్ రావూరి ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. 
 
సెప్టెంబర్ నెలలో జరిగే షూటింగ్ తో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. నవంబర్ నెలలో చిత్రం విడుదల అని, చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఒక్కొక్కటిగా తెలియ పరుస్తామని తెలిపారు నిర్మాతలు.
సాంకేతిక నిపుణులు: ఛాయాగ్రహణం: వంశీ పచ్చి పులుసు
సంగీతం: గోపిసుందర్
మాటలు: గణేష్ కుమార్ రావూరి
పాటలు: శ్రీమణి, ఎస్. భరద్వాజ్ పాత్రుడు
ఎడిటర్: నవీన్ నూలి
పోరాటాలు : డ్రాగన్ ప్రకాష్
ప్రొడక్షన్ డిజైనర్: వివేక్ అన్నామలై
ప్రొడక్షన్ కంట్రోలర్: సి హెచ్. రామకృష్ణా రెడ్డి
పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్
నిర్మాత‌లు: నాగ‌వంశీ ఎస్‌. - సాయి సౌజ‌న్య‌
దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments