Webdunia - Bharat's app for daily news and videos

Install App

''యాత్ర''లో అనసూయ స్టిల్ వచ్చేసింది.. షర్మిలగా కనిపించనుందా? (video)

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (18:29 IST)
యాంకరింగ్‌తో పాటు సినిమాల్లో వైవిధ్య పాత్రలను ఎంచుకుంటూ.. ముందుకెళ్తున్న రంగమ్మత్త.. తాజాగా ''యాత్ర'' సినిమాలో నటిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా వస్తున్న ''యాత్ర''లో అనసూయ కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. మహి వి. రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటిస్తున్నారు. 

ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాలో అనసూయ కర్నూలుకు చెందిన రాజకీయ నాయకురాలిగా నటించనున్నారని వార్తలొచ్చాయి. కానీ ప్రస్తుతం విలేకరిగా కన్పించనున్నట్లు టాక్ వస్తోంది. తాజాగా సెట్‌లో కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు తీసిన ఫొటోను అనసూయ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ ఫోటోలో అనసూయ గెటప్ చూస్తుంటే..  యాత్రలో షర్మిల పాత్రను ఆమె పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
అంతేగాకుండా ఈ సినిమాలో రావు రమేష్, సుహాసిని, జగపతి బాబు కీలక పాత్రలో కనిపిస్తున్నారని సమాచారం. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్‌ సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేశ్‌ కనిపించనున్నారట. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రతి పాత్ర ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునేలా తెరకెక్కించినట్లు గతంలో దర్శకుడు రాఘవ్‌ వెల్లడించారు. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైఎస్సార్‌ కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకుని డిసెంబరు 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
 
ఇప్పటికే అనసూయ చేసే టీవీ షోలు టాప్ రేటింగ్‌లో వున్నాయి. ''రంగస్థలం'' సినిమాతో అనసూయకు మంచి గుర్తింపు వచ్చింది. ఈమె కోసమే దర్శకులు కీలక పాత్రలను క్రియేట్ చేస్తున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. తాజా ''యాత్ర''తో కూడా ఆమె క్రేజ్ మరింత పెరుగుతుందని.. మరిన్ని సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తాయని సినీ జనం చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments