Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి ఎమ్మెల్యే రోజాతో యాంకర్ అనసూయ సిట్టింగులు... ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (17:29 IST)
అనసూయ. బుల్లితెరపైన, వెండితెరపైన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్ననటి. బుల్లితెరపై ప్రత్యేక కార్యక్రమాల్లో యాంకర్‌గా వ్యవహరిస్తూ అశేష ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఇక సినిమాల్లో కూడా అడపాదడపా కొన్ని పాత్రల్లో నటిస్తూ ఉంది. అప్పుడప్పుడు చేస్తున్నా సరే ఆ సినిమాలన్నీ అనసూయకు బాగా కలిసొస్తున్నాయి. మంచి పేరును తీసుకువస్తున్నాయి. అదృష్టం అలా వరిస్తోంది. 
 
ప్రస్తుతం అనసూయ యాత్ర సినిమాలో నటిస్తోంది. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రపై తీస్తున్న సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాలో ఒక కీ రోల్ పోషిస్తోంది అనసూయ. ఒక రాజకీయ నాయకురాలిగా కనిపించబోతోంది. రాజకీయాల గురించి అస్సలు తెలియని అనసూయకు ఆ పాత్ర ఇవ్వడంతో ఇబ్బంది పడుతోందట. 
 
అందుకే ఏదో ఒక పార్టీ నాయకురాలిని కలిసి రాజకీయాలంటే ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలని భావిస్తోందట. రాజశేఖర్ రెడ్డి సినిమా కాబట్టి వైసిపి మహిళా నేతలనే కలిసిందట. అందులోను ఫైర్ బ్రాండ్ రోజాను కలిసి సలహా అడిగిందట. వైసిపిలో రెండవ స్థానంలో ఉన్న రోజా ఇచ్చిన సలహాతో మెళుకువలను నేర్చుకుంటోందట అనసూయ. అయితే అనసూయ రోజాను కలవడంతో ఆమె వైసిపిలోకి వెళుతోందన్న ప్రచారం సినీపరిశ్రమలో ప్రారంభమైందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తనపై అఘాయిత్యం చేస్తున్న ఉపాధ్యాయుడిని Live video తీసిన విద్యార్థిని

గత 30 ఏళ్లలో తొలిసారిగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం

యూపీలో ఘోరం- రక్షాబంధన్ రోజే 14 ఏళ్ల చెల్లిపై అత్యాచారం.. ఆపై హత్య

Tirupati: శ్రీవారికి వైజయంతి రాళ్లతో పొదిగిన బంగారు లక్ష్మీ లాకెట్టు

గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో భారీ వర్షం- 52 మి.మీ.వరకు వర్షపాతం నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments