Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలిపిరిలో బాంబు దాడికి లోకేష్, భువనేశ్వరిలే కారణమా : రోజా సంచలనం

అలిపిరిలో బాంబు దాడికి లోకేష్, భువనేశ్వరిలే కారణమా : రోజా సంచలనం
, మంగళవారం, 30 అక్టోబరు 2018 (14:29 IST)
తిరుమలలో రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, క్యాబినెట్ మంత్రులు ప్రజలకు, ప్రతిపక్షానికి రక్షణ కల్పించడంలో విఫలం అయ్యారన్నారు. విఫలం అయింది కాకుండా వెటకారంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీతోను, బిజెపితోను జగన్ రాజకీయ భవిష్యత్‌ను దెబ్బ తీయడానికి చంద్రబాబు జత కట్టారని, ఇప్పుడు ఆపరేషన్ గరుడ అంటూ శివజీతో జత కలిసి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. 
 
టీడీపీతో సంభంధం లేని వ్యక్తి ..., గరుడ ఆపరేషన్‌లోముఖ్యమైన వ్యక్తి గతంలో మీ కేబినెట్ మీటింగ్‌లో ఎందుకు పాల్గొన్నాడో తెలపాలని, శివాజీ చెప్పింది జరుగుతుంటే ఎందుకు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయట్లేదని, శివాజీ చెప్పింది వేదవాక్కు కాదు...., అలాంటి ఒక సీఎం ప్రెస్ మీట్‌లో అతను చెప్పింది చెప్పడం సిగ్గుచేటన్నారు. 
 
జగన్ పైన జరిగిన హత్యా యత్నం ఒక డ్రామా అని అబద్ధపు మాటలు మాట్లాడారని, రీమాండ్ రిపోర్టులో కచ్చితంగా హత్యా యత్నమే అని తెలిసిందని, ఇది టీడీపి వాళ్ళు చేసిన హత్యాయత్నంలాగే ఉందన్నారు.
 
రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి టీడీపి పార్టీ అతనని, ఇన్సిడెంట్ జరిగిన గంట లోపు శ్రీనివాస్ జగన్ అభిమాని అంటూ ఒక ఫ్లెక్సీని విడుదల చేయడం టీడీపి ప్లాన్‌లా కనపడుతుందన్నారు. కోడి కత్తి ఏడాదిగా ఆ రెస్టారెంట్లో ఉందని మీ పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలిందని, 
ఎన్.ఓ.సి లేకుండా ఎలా అతనికి ఉద్యోగం ఇచ్చారని ప్రశ్నించారు.
 
కోటి రూపాయలకు శ్రీనివాస్ తన ఊరిలో స్థలాన్ని కొనడానికి  బేరం ఆడి వచ్చాడంటే టీడీపీతో ఎంత డీల్ కుదుర్చుకున్నారో అర్థమవుతుందని, బయట నుండి ఎలాంటి స్నాక్ ఇవ్వకూడదు అని తెలిపిన వాళ్ళు...., జగన్‌కు కాఫీ ఇచ్చే క్రమంలో హత్యయత్నానికి పాల్పడ్డారని, ముందస్తు ప్లాన్ ప్రకారం చేసినట్లు అనిపిస్తుంటే..., హర్ష వర్థన్‌ని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదో చెప్పాలన్నారు.
 
కేంద్ర హోమ్ శాఖ మంత్రిని కలిసి కేంద్రం దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిగే విధంగా చర్యలు తీసుకోమని, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడటం చాలా బాధాకరమని, షర్మిల, విజయమ్మ సీఎం పదవి కోసమే జగన్ పైన హత్య చేయడానికి ప్రయత్నించారని చెప్పడం బాధాకరమని, రాజేంద్ర ప్రసాద్  సూటిగా ప్రశ్నిస్తున్నా..... అలిపిరి ఘటనకు లోకేష్, భువనేశ్వరి కారణం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అడ్డు తొలగించుకొని భువనేశ్వరి సీఎం అవ్వాలని ఆలోచించారా... అని ప్రశ్నించారు రోజా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ సమాధికి మోకరిల్లి సారీ చెబితే... రెబెల్ ఎమ్మెల్యేలకు పిలుపు