Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర @3000.. ఆహారం ఇదే..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర సోమవారంతో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. విజయనగరం జిల్లాలోని కొత్తవలస వద్ద మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు.

Advertiesment
జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర @3000.. ఆహారం ఇదే..!
, సోమవారం, 24 సెప్టెంబరు 2018 (16:30 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర సోమవారంతో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. విజయనగరం జిల్లాలోని కొత్తవలస వద్ద మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాసంకల్పయాత్ర 3000 కి.మీ. పైలాన్‌నే జగన్ ఆవిష్కరించి, ఓ మొక్కను నాటారు. 
 
అనంతరం, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తీసుకొచ్చిన కేక్‌ను కట్ చేసిన జగన్, తన యాత్రను కొనసాగించారు. కాగా, గత ఏడాది నవంబర్ 6న ఇడుపులపాయలో జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. టిడిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.
 
ఇడుపులపాయలో మొదలైన జగన్ ప్రజాసంకల్పయాత్ర 11 జిల్లాల్లో ముగిసి 12వ జిల్లా విజయనగరంలో ప్రవేశించింది. జగన్ పాదయాత్ర ఈరోజే విజయనగరం జిల్లాలో ప్రవేశించినందున ఈ జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాలోనూ జగన్ పాదయాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే ఇలా రెండు జిల్లాలు ఉండగానే జగన్ 3000 కి.మీ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం.
 
జగన్ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారంటే?
జగన్ ఉదయం అల్పాహారానికి బదులు తేవలం జ్యూస్ మాత్రం తీసుకుని యాత్రను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం కేవలం పండ్లు, కప్పు పెరుగు మాత్రమే ఆహారంగా తీసుకుంటారని కార్యకర్తలు చెప్తున్నారు. రాత్రి పూట ఆహారాన్ని కేవలం ఒకటీ రెండు పుల్కాలు, పప్పు, మరో కూరతో ముగిస్తారు. నిద్రకు ఉపక్రమించే ముందు కప్పు పాలు తాగుతారు. 
 
ఇప్పటి వరకూ ఇదే ఆయన దినచర్య అని అనుచరులు వివరించారు. ఇలా మితాహారం, అధిక వ్యాయామంతోనే ఆయన రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా జనంతో  పాదయాత్రతో ముందుకు సాగుతున్నారని చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముస్లిం బాలికల జననాంగ ఛేదనపై పిల్..