Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బండ్ల గణేష్‌‌కు జనసేనాని క్లాస్... బండ్ల అటూఇటూ కాకుండా అయిపోతాడనీ...

బండ్ల గణేష్. ఈయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సాధారణ కమెడియన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ఆ తరువాత బడా నిర్మాతగా మారిపోయారు బండ్ల గణేష్. తెలుగు సినీపరిశ్రమలోనివారే ఆశ్చర్యపోయే విధంగా బండ్ల గణేష్‌ కొన్ని భారీ బడ్జెట్ సినిమాలను తీశారు. అయితే గణేష

Advertiesment
బండ్ల గణేష్‌‌కు జనసేనాని క్లాస్... బండ్ల అటూఇటూ కాకుండా అయిపోతాడనీ...
, సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:56 IST)
బండ్ల గణేష్. ఈయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సాధారణ కమెడియన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ఆ తరువాత బడా నిర్మాతగా మారిపోయారు బండ్ల గణేష్. తెలుగు సినీపరిశ్రమలోనివారే ఆశ్చర్యపోయే విధంగా బండ్ల గణేష్‌ కొన్ని భారీ బడ్జెట్ సినిమాలను తీశారు. అయితే గణేష్‌ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. తన గురువు పవన్ కళ్యాణ్‌ పెట్టే జనసేన పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ బండ్ల గణేష్‌ మాత్రం ఆ పార్టీలో చేరలేదు.
 
నేరుగా ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు బండ్ల గణేష్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణా హైదరాబాద్ నగరంలోని ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌ ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకి. తన గురువు వ్యతిరేకిస్తున్న పార్టీలో చేరిన బండ్ల గణేష్ ఇప్పుడు మీడియాతో మాట్లాడలేక కెమెరాలు చూస్తే వెళ్ళిపోతున్నాడు. తరువాత మాట్లాడుతానంటూ మైకులను తోసి పరుగులు పెడుతున్నాడు బండ్ల గణేష్‌. ఇదే విషయంపై పవన్ కళ్యాణ్‌ స్వయంగా బండ్ల గణేష్‌‌కు ఫోన్ చేసినట్లు కూడా తెలుస్తోంది. 
 
మనం సొంతంగా పెట్టిన పార్టీ ఉండగా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఏమిటని ప్రశ్నించారట పవన్ కళ్యాణ్‌. అయితే అతిపెద్ద పార్టీ కాబట్టి అందులో చేరానని పవన్‌కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎలాగోలా గురువుకు నచ్చజెప్పి బండ్ల గణేష్ ఫోన్ పెట్టినట్లు సమాచారం. తెలంగాణా రాష్ట్రంలో పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎమ్మెల్యే అవ్వొచ్చన్న ఆశతోనే బండ్ల గణేష్ ఆ పార్టీలో చేరినట్లు సన్నిహితులు చెబుతున్నారు. కానీ బండ్ల గణేష్‌‌కు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులకు ఏ మాత్రం ఇష్టం లేదట. మకి బండ్ల అటుఇటూ కాకుండా అయిపోతాడేమోనని అనుకుంటున్నారు. అంటే... ఇటు పవన్ పార్టీతో చెడిపోయి... అటు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ రాక ఏమవుతాడోననీ... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో... బాలాపూర్ లడ్డును అంత పెట్టి కొన్నారా?