మెదడు లేని మూర్ఖులే అలాంటి పిచ్చి రాతలు రాస్తారు : అమితాబ్ బచ్చన్

ఠాగూర్
సోమవారం, 9 డిశెంబరు 2024 (11:38 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు కోపమొచ్చింది. తన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్‌లు విడిపోతున్నారంటూ సాగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. మెదడులేని మూర్ఖులే పిచ్చిరాతలు రాస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తప్పులను దాచి ఇతరుల లోపాలను వెతుకుతారంటూ ట్వీట్ చేశారు. 
 
నిజానికి బాలీవుడ్ సెలబ్రెటీ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడిపోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ జంట ఎవరికి వారుగా ఫంక్షన్లకు హాజరు కావడం, ఒంటరిగానే ప్రయాణాలు చేస్తూ కనిపించడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. తాజాగా ఈ ప్రచారంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పరోక్షంగా స్పందించారు. 
 
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో ఈ రూమర్స్ ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచంలో మూర్ఖులకు కొదవలేదని, మనం ఏం మాట్లాడినా దానికి కుత్సిత మెదడుతో తమకు కావాల్సిన అర్థిం తీస్తారని విమర్శించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఇతరులలో లేని లోపాలను వెతుకుతుంటారని అన్నారు.
 
మెదడులేని ఇలాంటి వ్యక్తుల రాతల వెనక వారి అజ్ఞానం, తెలివితక్కువతనం కనిపిస్తాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి వారి వ్యక్తిగత జీవితాల్లోని దురదృష్టాలను దాచి, ఇతరుల మాటల్లో ప్రతీ పదానికీ పెడార్థం తీస్తారంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు. 
 
కాగా, ఇటీవల అభిషేక్ బచ్చన్ ఓ ట్వీట్ చేస్తూ సుదీర్ఘ కాలం దాంపత్య జీవనం గడిపిన వారు కూడా విడాకులు తీసుకుంటున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయని పేర్కొన్నారు. ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నిస్తూ ఓ సామాజిక సమస్యపై చర్చ కోసం చేసిన ఈ ట్వీట్‌ను ఆయన సొంత జీవితానికి ఆపాదించి అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రచారం చేస్తున్నారని అమితాబ్ పరోక్షంగా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

ఏబీసీ క్లీన్‌టెక్, యాక్సిస్ ఎనర్జీతో రూ. 1,10,250 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments