ఉదయించే సూర్యుడికి రెండాకుల గుర్తే శత్రువు : డీఎంకే

ఠాగూర్
సోమవారం, 9 డిశెంబరు 2024 (10:22 IST)
తమిళ సినీ నటి కస్తూరి శంకర్ మరోమారు నోటికి పని చెప్పారు. ఈ దఫా అధికార డీఎంకేను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. గత ఆరు దశాబ్దాలుగా ఉదయించే సూర్యుడుకి రెండాకుల గుర్తే శత్రువుగా ఉందని ఆమె ఆరోపించారు. అలాగే, కొత్తగా పార్టీ పెట్టిన హీరో విజయ్‌ ఎలాంటి ఎన్నికల గుర్తు తీసుకుంటారో తనకు ఎలా తెలుసని ఆమ మీడియాకు ఎదురు ప్రశ్నించారు. 
 
ఇటీవల తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలతో సినీనటి కస్తూరి జైలుకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కీలక పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలను ఉద్దేశిస్తూ రాష్ట్రంలో ఉదయించే సూర్యుడికి శత్రువుగా రెండాకుల గుర్తే 60 ఏళ్లుగా ఉందన్నారు.
 
ఇక కొత్తగా టీవీకే పార్టీ పెట్టిన నటుడు విజయ్ ఇంకా పార్టీ గుర్తు తీసుకోలేదని, ఆయన ఏ చిహ్నం తీసుకోనున్నారో తెలియదన్నారు. ఓ పార్టీ కూటమికి వ్యతిరేకంగా అన్నీ పార్టీలు వేర్వేరుగా పోరాడుతున్నాయని, అవన్నీ ఒకే గొడుగు కిందికి రావాలని కస్తూరి తెలిపారు. ప్రజల సమస్యలన్నింటికీ అధికార పార్టీనే కారణమన్న మానసికస్థితికి వచ్చేశారన్నారు.
 
ఇక తాను జైలుకు వెళ్లినప్పుడు తనకు మద్దతుగా మొదట మాట్లాడిన తొలి వ్యక్తి సీమాన్ అని ఆమె పేర్కొన్నారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, సీమాన్ కూడా ఈసారి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలనుకుంటున్నారని కస్తూరి చెప్పారు. డీఎంకేను చిత్తుగా ఓడించాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments