Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారు ఇండియన్ సినిమా ఏ బి సి. కావడం గర్వంగా వుంది: నాగార్జున

Advertiesment
Akkineni family with chiru, amitab

డీవీ

, మంగళవారం, 29 అక్టోబరు 2024 (08:12 IST)
Akkineni family with chiru, amitab
'ఏయన్నార్‌ అవార్డు ప్రదానం నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియో కుటుంబసభ్యులు, సన్నిహితులమధ్య అక్కినేని నాగార్జున నిర్వహించారు. ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌, మెగాస్టార్ చిరంజీవికి అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక సాగింది.  
 
 నాగార్జున గారు మాట్లాడుతూ.. ఏయన్నార్‌ ఈ మూడు అక్షరాలే నాకు ప్రపంచం. నాకే కాదు మా కుటుంబం, స్నేహితులు, అభిమానులు అందరికీ. మా నాన్న గారు హ్యుమానిటీని నమ్మారు. మనుషుల్ని నమ్మారు. అన్నిటికంటే ముఖ్యంగా సినిమాని బిలీవ్ చేశారు. అభిమానులు, ప్రేక్షకులు మనసులో చిరస్థాయిగా ఒక లెజెండ్ గా నిలిచారు. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిల్చే అలాంటి గొప్ప వ్యక్తులని గౌరవించడం ఏయన్నార్‌ అవార్డు ముఖ్య ఉద్దేశం. ఈరోజు అలాంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు, ఇండియన్ సినిమా ఏ బి సి.. అమితాబచ్చన్ జి, మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ ఏడాది నా డియర్ ఫ్రెండ్, పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు ఇవ్వడం ఎంతో ప్రత్యేకం. ఈ అవార్డుని నేను ఎంతగానో ఆరాధించే పద్మ విభూషణ్ అమితాబచ్చన్ ప్రజెంట్ చేయడం ఇంకా స్పెషల్.  కొన్నేళ్ల క్రితం అమితాబచ్చన్ ఏఎన్నార్ అవార్డుని అందుకోవడం లు అవార్డు ప్రతిష్టని మరింతగా పెంచింది. ఈరోజు చిరంజీవి గారికి అవార్డు ప్రధానం చేయడానికి అమితాబచ్చన్ గారు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా ఇది మాకు ఎంతో ప్రత్యేకం.  
 
రీసెంట్ గా కల్కి సినిమా చూశాను. అమితాబచ్చన్ గారిని అశ్వద్ధామ చూసినప్పుడు మా ఒరిజినల్ మాస్ హీరో ఇస్ బ్యాక్ అనిపించింది. ఇదే విషయం ఆయనకి కాల్ చేసి చెప్పాను. ఆయన ఎంతో ఆనందంగా నవ్వారు. అది నాకు చాలా  సంతోషాన్ని ఇచ్చింది.  అమితాబచ్చన్ గారి స్క్రీన్ ప్రజెంట్, మేనరిజం, ఇంపాక్ట్ సింప్లీ అండ్ అన్ టచబుల్.  అమితాబ్ బచ్చన్ గారు ఎన్నో సామాజిక కార్యక్రమాలకి  బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు.  హ్యాట్సాఫ్ అమితాబచ్చన్ గారు. 
 
మై డియర్ ఫ్రెండ్ చిరంజీవి గారితో నాకు ఎన్నో బ్యూటిఫుల్ మెమోరీస్ ఉన్నాయి. ఆయన సినిమాలు గురించి మీ అందరికీ తెలుసు ఆయన హిట్లు సూపర్ హిట్లు బ్రేక్ చేసిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఈమధ్య గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కారు. నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు.. నాన్నగారు ఒకసారి అన్నపూర్ణ స్టూడియోస్ లో చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుంటే ఆయన డాన్స్ ని చూడమని నాకు చెప్పారు. అప్పుడు రెయిన్ సాంగ్ జరుగుతుంది. చిరంజీవి గారి డాన్స్, గ్రేస్ చూసి నాకు కొంచెం గుబులు పుట్టింది. ఆయనలాగా డాన్స్ చేయగలనా అనిపించింది. అలా ఆయనతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. చిరంజీవి గారి స్పెక్టాక్యులర్ సినిమా జర్నీ మనందరికీ తెలుసు. అలాగే ఆయన వెలకట్టలేని సామాజిక సేవ కార్యక్రమాలు ఎన్నో చేశారు. 
 
చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. కోవిడ్ టైంలో ఫిలిం వర్కర్స్ అందరికీ ఒక దారి చూపించారు. నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారు. మనం సొసైటీ నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు మళ్లీ తిరిగి ఇవ్వాల్సి  బాధ్యత మన మీద ఉంటుందని. చిరంజీవి గారు, అమితాబచ్చన్ గారు అదే చేసి చూపించారు. అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారిని కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలిచారు.అది ముమ్మాటికి నిజం. ఇలాంటి ఈ వేదికపై ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది అమితాబచ్చన్ గారు ఏఎన్ఆర్ అవార్డు ని చిరంజీవి గారిని చిరంజీవి గారికి ప్రజెంట్ చేయడం మా అందరికీ ఎంతో సంతోషం. కీరవాణి గారు మా ఫాదర్ జర్నీ ని వారి మ్యూజిక్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. థాంక్యూ కీరవాణి గారు. ఈ వేడుకకి విచ్చేసిన స్నేహితులు, సినీ పరిశ్రమ ప్రముఖులు, థాంక్యూ ఆల్. ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్' అన్నారు
 
టి సుబ్బిరామిరెడ్డి గారు మాట్లాడుతూ. నాగార్జున ఎక్స్ ట్రార్డినరీ పర్శన్. ఎంత అద్భుతంగా మాట్లాడారు. ఎంత గొప్పగా ఈ అవార్డు వేడుకని ఏర్పాటు చేశారు. నాగార్జునని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దాదాపు 60 సంవత్సరాల నుంచి నాకు అక్కినేని నాగేశ్వరరావు గారికి అనుబంధం ఉంది. ఆయన నటన హిమాలయాల శిఖరాలకు వెళ్లింది. ఆయన జీవితం అద్భుతం అమోఘం. ఆయన ఎప్పుడూ నా గుండెల్లో జీవిస్తూనే ఉంటారు. నాగేశ్వరావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు నాతో ఒక మాట చెప్పారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎంత ప్రతిష్టాత్మకంగా ఉందో ఏఎన్ఆర్ అవార్డు కూడా అంత ప్రతిష్టాత్మకంగా ఉండాలని నన్ను చైర్మన్ గా  చేశారు నేను రెండుసార్లు చైర్మన్ గా ఉన్నాను . ఈ అవార్డు కమిటీ చైర్మన్  ఉండడం నాకు ఎంతో సంతోషం, గొప్ప గౌరవం. ఎంతో మంది లెజెండ్స్ కి అవార్డ్స్ ఇస్తూ వచ్చాం. ఈసారి మరో గొప్ప లెజెండ్ చిరంజీవి గారికి అవార్డు ఇవ్వడం మాకెంతో గౌరవంగా ఉంది. చిరంజీవి గారు అందరి గుండెల్లో చిరంజీవిగా ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు. చిరంజీవి గారు గర్వాన్ని జయించిన గొప్ప మనిషి. అలాగే  అలాగే అమితాబ్ బచ్చన్ గారు కూడా మహోన్నతమైన వ్యక్తి. ఎంత స్టార్డమ్ ఉన్నప్పటికీ గొప్ప మానవత్వంతో ఉంటారు. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. చరిత్రలో ఎవరు ఇలా చేయలేదు. ఎంతోమంది ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చారు అలాంటి చిరంజీవి గారికి ఏఎన్నార్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది.  థాంక్యూ టు ఆల్' అన్నారు.
 
ఈ అవార్డు వేడుకలో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ప్రత్యేకంగా సన్మానించారు. హీరోలు వెంకటేష్, రామ్ చరణ్, నాని, సిద్దు జొన్నలగడ్డ, సుధీర్ బాబు, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, నాగ్ అశ్విన్, చందూమొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, శ్యాం ప్రసాద్ రెడ్డి, టీజీ విశ్వప్రసాద్, సునీల్ నారంగ్, స్వప్న దత్, హీరోయిన్స్ రమ్యకృష్ణ, శ్రీలీల, నటులు ప్రకాష్ రాజ్, మురళిమోహన్, అలీ, రాజేంద్రప్రసాద్, రైటర్ విజయేంద్రప్రసాద్, అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకు మహా అద్భుతంగా జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శోభితను చిరంజీవికి పరిచయం చేసిన నాగార్జున (video)