అక్కినేని నాగార్జున మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. అక్టోబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు.
ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు శత దినోత్సవాలకు సంబంధించి జరిగిన ఓ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ ఈసారి అక్కినేని జాతీయ పురస్కారం చిరంజీవికి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా స్వయంగా ఆహ్వానించేందుకు నాగార్జున మెగాస్టార్‌ను కలిశారు.
ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి స్పెషల్ పోస్ట్ చేసారు నాగార్జున. ఈ ఏడాది తనకెంతో ప్రత్యేకమైందని.. నాన్నగారి అవార్డు కార్యక్రమానికి చిరంజీవి, అమితాబ్ బచ్చన్ రానున్నారు. దీంతో ఈ వేడుక ప్రత్యేకం కానుంది.
ఈ శతజయంతి వేడుకలను మరపురానిదిగా చేద్దామని పేర్కొన్నారు. కింగ్, బాస్ కలిసి ఒకే ఫోటో ఫ్రేమ్‌లో కనపడటంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
60 ఏళ్ళు దాటినా ఇద్దరూ ఇంకా ఫిట్‌గా ఉండి ఇప్పటి హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారని వారు కొనియాడుతున్నారు. ఇక వీరి సినిమాల విషయానికి కొస్తే, చిరంజీవి విశ్వంభర చకచకా ముస్తాబవుతోంది. నాగార్జున కుబేరల నటిస్తున్నారు.