పద్మవిభూషణ్ చిరంజీవి గారికి అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ... తనకు వైజయంతీ మూవీస్, చిరంజీవి, నాగార్జున తమ సినిమాల్లో నటించే అవకాశం కల్పించారు. ఇలా తెలుగు సినిమాల్లో నటించడం ద్వారా నేను కూడా తెలుగు సినీ ఇండస్ట్రీ కుటుంబ సభ్యుడినైనందుకు గర్వపడుతున్నా అని అన్నారు.
చిరంజీవిగారు వాన పాట డ్యాన్స్ చూసి వేరే దారి బెటర్ అనుకున్నా: నాగార్జున
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ... నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్న సమయంలో ఒకరోజు మా నాన్నగారు నన్ను పిలిచారు. స్టూడియోలో చిరంజీవి డ్యాన్స్ పాట షూటింగ్ జరుగుతోంది. నువ్వెళ్లి చూడు, నీకు ఉపయోగపడుతుంది అంటే వెళ్లాను. అక్కడ చిరంజీవి గారు తెల్లటి షర్ట్ వేసుకుని నటి రాధతో డ్యాన్స్ చేస్తున్నారు. ఆ డ్యాన్స్ చూసి నాకు గుబులు పుట్టింది. ఇలా డ్యాన్స్ నేను చేయగలనా అనిపించి, వేరే దారి చూసుకుందాము అనుకున్నాను" అన్నారు.
చిరంజీవి గారి నటించిన సినిమాలు గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆయన చేసిన డ్యాన్స్ మూవ్‌మెంట్స్ పైన గిన్నిస్ రికార్డ్ కూడా వచ్చిందని అన్నారు నాగ్.