Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్.. తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దు.. నేనింకా కోలుకోలేదు : అమితాబ్

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (09:35 IST)
బాలీవుడ్ సినీ దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఈయన ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈయనకు నిర్వహించిన తాజా పరీక్షల్లో కరోనా నెగెటివ్ అని వచ్చినట్టు వార్తలు వచ్చాయి. జాతీయ ఎలక్ట్రానిక్ మీడియా అయితే, ఏకంగా బ్రేకింగ్ న్యూస్ కథనాలను ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలో కూడా అమితాబ్ కరోనా నెగెటివ్ టెస్టుపై పోస్టులు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. 
 
అయితే, ఈ వార్తలను అమితాబ్ ఖండించారు. టెస్టులో తనకు నెగెటివ్ రాలేదని... తాను కోలుకున్నాననే వార్తలో నిజం లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. బాధ్యతారాహిత్యంగా తప్పుడు వార్తను ప్రసారం చేశారని అసహనం వ్యక్తం చేశారు.
 
కాగా, ఈ నెల 12వ తేదీన అమితాబ్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కుమారుడు అభిషేక్ బచ్చన్‌కి కూడా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయన కూడా ఆసుపత్రిలో చేరారు. దీంతో, అభిషేక్ భార్య ఐశ్వర్యరాయ్, కూతురు ఆరాధ్య హోం ఐసొలేషన్‌లో గడిపారు. అయితే, రెండు రోజుల తర్వాత వీరిద్దరికి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో వీరిని కూడా ఆసుపత్రికి తరలించారు. అమితాబ్ భార్య జయా బచ్చన్‌కు మాత్రం కరోనా నెగెటివ్ వచ్చింది.
 
అమితాబ్ కుటుంబానికి కరోనా వచ్చిన నేపథ్యంలో ఆయన బంగ్లా జల్సాను బీఎంసీ అధికారులు శానిటైజ్ చేశారు. బంగ్లా వెలుపల కంటైన్మెంట్ నివాసంగా బోర్డును ఏర్పాటు చేశారు. మరోవైపు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే, ఎప్పటికప్పుడు అమితాబ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments