'సైరా'లో గోనగన్నారెడ్డి... ముకుంద కూడా...

మెగాస్టార్ చిరంజీవ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో పలు కీలక పాత్రల్లో అనేక

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (13:11 IST)
మెగాస్టార్ చిరంజీవ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో పలు కీలక పాత్రల్లో అనేక సీనియర్ నటీనటులు నటిస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు కూడా నటించనున్నారనే వార్త ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది.
 
తాజా స‌మాచారం ప్ర‌కారం చారిత్రాత్మ‌క చిత్రం 'రుద్ర‌మ‌దేవి'లో గోన గ‌న్నారెడ్డిగా కనిపించి అల‌రించిన అల్లు అర్జున్ సైరాలోను క‌త్తిప‌ట్టి క‌నిపించ‌నున్నాడ‌ట‌. రుద్ర‌మదేవిలో వెరైటీ స్లాంగ్‌తో బన్నీ చెప్పిన 'గ‌మ్మునుండ‌వోయ్' అనే డైలాగ్ ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 
 
మ‌రి సైరాలో బ‌న్నీ ఎలాంటి గెట‌ప్‌తో సంద‌డి చేస్తాడో తెలియాలంటే కొన్నాళ్ళ పాటు ఆగాల్సిందే. మ‌రో మెగా హీరో వ‌రుణ్ తేజ్ కూడా సైరాలో క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. అయితే, వార్త‌ల‌పై క్లారిటీ రావ‌లసి ఉంది.
 
కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ అమితాబ్‌తో పాటు విజయ్ సేతుపతి, సుదీప్, న‌య‌న‌తార‌, జగపతిబాబు వంటి స్టార్లు కీలకపాత్రల్లో నటిస్తుండగా, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఓ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments