7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో "పుష్ప" స్ట్రీమింగ్

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (13:05 IST)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "పుష్ప". ఈ  చిత్రం గత నెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇప్పటికే రూ.300 కోట్ల మేరకు కలెక్షన్లు రాబట్టినట్టు సమాచారం. విడుదలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలన్నింటిలోనూ ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసి కనకవర్షం కురిపిస్తుంది. 
 
ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ నెల 7వ తేదీన విడుదల కావాల్సిన "ఆర్ఆర్ఆర్" వివిధ కారణాలతో వాయిదాపడిన విషయం తెల్సిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు వీలుగా ఈ నెల 7వ తేదీన ఓటీటీలో పుష్ప విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మూవీ మేకర్స్ కూడా అధికారిక ప్రకటన చేశారు.
 
ఇదిలావుంటే, ఈ చిత్రం హిందీ వెర్షన్‌ను ఓవర్సీస్‌లో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో అక్కడ ఈ సినిమాను విడుదల చేసిన సంస్థ వారే హిందీ వెర్షన్‌ను కూడా విడుదల చేయనున్నారు. హిందీలో ఈ చిత్రం కేవలం 15 రోజుల్లో ఏకంగా రూ.50 కోట్లు రాబట్టింది. ఇపుడు రూ.100 కోట్ల దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన - టెక్ దిగ్గజాలతో వరుస భేటీలు

పెళ్లి సంబంధాలు చూస్తున్నారనీ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

3460 సార్లు శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తాగ్రేసరుడు....

కారును ఢీకొన్న విమానం... వీడియో వైరల్

రేవంత్ రెడ్డి విజన్ విన్నాక విజ్ఞప్తిని తిరస్కరించలేకపోయా : ఆనంద్ మహీంద్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

తర్వాతి కథనం
Show comments