Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుష్ప థ్యాంక్యూ మీట్లో ఎమోషనల్ అయిన సుకుమార్‌, అల్లు అర్జున్

Advertiesment
పుష్ప థ్యాంక్యూ మీట్లో ఎమోషనల్ అయిన సుకుమార్‌, అల్లు అర్జున్
, మంగళవారం, 28 డిశెంబరు 2021 (18:30 IST)
Pushpa Thanks Meet
పుష్ప సినిమా విడుదలై సంచలన విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు. తన కెరీర్లో సాధించిన విజయం లో సుకుమార్ పాత్ర ఎంతో ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన మాట్లాడుతూ.. ' ఈ రోజు సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. నా కెరీర్లో ఆర్య అనేది ఒక మైలురాయి.. సుకుమార్ లేకపోతే ఆర్య లేదు.. ఆర్యా లేకపోతే నేనులేను.. ఈ రోజు నా కెరీర్ ఇంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం సుకుమార్ అని గర్వంగా చెబుతాను. సుకుమార్ నాకు మంచి స్నేహితుడు. ఇక సినిమా విషయానికి వస్తే హిట్ అయినా.. ఫ్లాప్ అయినా థాంక్యూ మీట్ అనేది కచ్చితంగా పెడతాను. ఎందుకంటే ఫలితంతో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా కష్టపడేది అంతా సమానంగానే ఉంటుంది. థాంక్యూ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. పుష్ప సినిమా కోసం అహర్నిశలు కష్టపడిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నాతో పాటు నటించిన నటీనటులకు.. సినిమా కోసం అడవుల్లో సైతం లెక్క చేయకుండా కష్టపడిన టెక్నికల్, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పుష్ప సినిమాను ఇంత బాగా ఆదరించినందుకు మరొకసారి తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ సినీ అభిమానులకు థాంక్యూ..' అని తెలిపారు.
 
పుష్ప సినిమా తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకొచ్చింది రష్మిక మందన. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. సుకుమార్ మాట్లాడుతూ.. ‘అల్లు అర్జున్ నాకు దేవుడు లాంటి వాడు. ఆయన చాలా గొప్ప నటుడు. మొహంలోనే అన్ని భావాలు పలికించగల గొప్ప నటుడు. అలాంటి నటుడు దొరకడం అదృష్టం. అన్ని ఎమోషన్స్ అద్భుతంగా పండించగల సత్తా అల్లు అర్జున్ సొంతం. ఆయనతో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను..’ అని తెలిపారు.
 
హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘పుష్ప సినిమా జనవరి 6 వరకు కచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా 325 కోట్లకు పైగానే కలెక్ట్ చేస్తుందని నమ్మకంగా చెప్తున్నాము. ఇప్పటి వరకు 285 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఇంకా బాగా వెళ్తుంది. తమ బ్యానర్‌కు పాన్ ఇండియన్ స్థాయి గుర్తింపు ఇవ్వడమే కాకుండా.. ఇంత పెద్ద విజయం అందించినందుకు ముందుగా హీరో అల్లు అర్జున్ గారికి, దర్శకుడు సుకుమార్ గారికి ధన్యావాదాలు తెలుపుకుంటున్నాము..’ అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండ 'లైగర్' అప్‌డేట్ - 31న గ్లింప్స్ రిలీజ్