Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ మూవీకి ఇలాంటి టైటిల్ పెట్టారేంటి..?

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (18:11 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది అల్లు అర్జున్‌కి 19వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
 
తండ్రీ కొడుకుల సెంటిమెంట్తో ఈ సినిమా రూపొందుతోందనీ... ఈ చిత్రానికి నేను - నాన్న, పార్ధు, అల‌క‌నంద‌... వీటిలో ఏదో ఒక టైటిల్‌ను ఖ‌రారు చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే... ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 
 
ఇదిలాఉంటే... ఈ చిత్రానికి ఊహించ‌ని టైటిల్ ఖ‌రారు చేసారని తెలిసింది. అదేంటంటే... అలా.. వైకుంఠ‌పురంలో. ఈ టైటిల్‌నే ఖ‌రారు చేసారని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 
 
బ‌న్నీ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా అలా...వైకుంఠ‌పురంలో అనే టైటిల్‌నే ఖ‌రారు చేసారా..? లేక వేరే టైటిల్ పెట్టారా..? అనేది ఆగ‌ష్టు 15న తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments