Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా‌... వైకుంఠ‌పురంలో.. ఫ‌స్ట్ లుక్ అదిరిందిగా..

Webdunia
సోమవారం, 2 సెప్టెంబరు 2019 (16:08 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సరికొత్త సినిమా 'అల వైకుంఠపురములో'. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, "సన్ ఆఫ్ సత్యమూర్తి" సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో ప్రస్తుతం హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా, మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. విభిన్నమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఒక డిఫరెంట్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఇటీవల యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఇకపోతే సోమవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అల్లు అర్జున్ రోడ్ ప్రక్కన కార్ ఆపి, అక్కడున్న స్టూల్‌పై కూర్చుంటే, ప్రక్కనున్న సెక్యూరిటీ గార్డ్, ఆయన సిగరెట్‌కు నిప్పంటించడం గమనించవచ్చు. 
 
ఒకింత ఆసక్తికరంగా డిజైన్ చేయబడిన ఈ పోస్టర్, ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సీనియర్ నటి టబు, మురళి శర్మ, సుశాంత్, నివేత పేతురాజ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం థమన్, సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్ అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments