Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూర్య‌ 'బందోబస్త్' ప్రీరిలీజ్ ఫంక్షన్‌కి ముహుర్తం ఫిక్స్

సూర్య‌ 'బందోబస్త్' ప్రీరిలీజ్ ఫంక్షన్‌కి ముహుర్తం ఫిక్స్
, సోమవారం, 2 సెప్టెంబరు 2019 (14:11 IST)
ప్రతి చిత్రంలోనూ పాత్రపరంగా నటనలోనూ, ఆహార్యంలోనూ వైవిధ్యం కనబరిచే కథానాయకుల్లో సూర్య ఒకరు. ‘గజిని’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’, ‘సింగం’ సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయన స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘బందోబస్త్’. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకుడు.

తెలుగు ప్రేక్షకులకు ‘నవాబ్’, విజువల్ వండర్ ‘2.0’ చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. హ్యారీస్ జైరాజ్ సంగీత దర్శకుడు. ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను సెప్టెంబర్ రెండో వారంలో గ్రాండ్‌గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన దేశభక్తి గీతం ‘ఎన్నో తారల సంగమం… అంబరం ఒకటే…’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 
 
అలాగే, ‘చెరుకు ముక్కలాంటి…’ పాట మాస్ ప్రేక్షకులను మెప్పించింది. కమాండోగా, రైతుగా సూర్య గెటప్పులు ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఆల్రెడీ విడుదలైన తెలుగు టీజర్, ట్రైలర్ యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. పాకిస్థాన్‌ తీరును ఎండగడుతూ మోహ‌న్‌లాల్‌ చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌, సూర్య నటన సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. అందువల్ల, విడుదలకు నెలన్నర ముందే శాటిలైట్ హక్కులు హాట్ కేకులా అమ్ముడయ్యాయి. 
 
ఈ సినిమా శాటిలైట్ హక్కులను భారీ రేటుకు ప్రముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్, స‌న్ నెట్‌వ‌ర్క్‌కి చెందిన ‘జెమినీ’ సొంతం చేసుకుంది. ‘బందోబస్త్’ తమిళ వెర్షన్ ‘కాప్పాన్’ పాటలు ఇటీవలే సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదలయ్యాయి. సోనీ మ్యూజిక్ సంస్థ ద్వారా ఆడియో విడుదల కానుంది. సూర్య సరసన సాయేషా సైగల్ నటిస్తున్న ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌, కీలక పాత్రలో ఆర్య నటిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండు రోజుల‌కు "సాహో" ఎంత క‌లెక్ట్ చేశాడో తెలుసా?