Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ - కొరటాల మూవీ స్టోరీ లీక్

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (16:28 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నారు. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే... బన్నీ కొరటాల శివతో సినిమాని ఎనౌన్స్ చేసారు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది.
 
ఈ మూవీని ఎనౌన్స్ చేయడంతో పాటు పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాకుండా... ఈ పోస్టర్లో ఉన్నదానిని బట్టి కథ ఇదే అంటూ ఓ స్టోరీ ప్రచారంలో ఉంది. ఇంతకీ ఆ కథ ఏంటంటే... ఓ నదికి ఇటువైపు హీరో తన స్నేహితుడితో నిల్చొంటాడు. వీళ్ల వైపు అంతా చీకటి, ఓ తెప్ప, గుడ్డిదీపం, అన్నీ రాళ్లురప్పలు.
 
నదికి మరోవైపు మాత్రం అభివృద్ధి చెందిన నగరం కనిపిస్తుంది. రోడ్లు, విద్యుత్ దీపాలు, భారీ భవంతలు, సెల్ టవర్లు ఇలా అన్నీ ఉన్నాయి. ఈ ఇద్దరు వ్యక్తులు ఆ నగరం వైపు చూస్తూ నిల్చొనేలా ఈ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. మంచి సందేశాత్మక సినిమాల్ని కమర్షియల్‌గా తీయడంలో కొరటాల దిట్ట.
 
ఇందులో బన్నీ స్టూడెంట్ లీడర్‌గా నటిస్తున్నాడని.. ఎంత అభివృద్ది చెందినా ఇంకా పల్లెటూర్లు అభివృద్దికి ఆమడ దూరంలో అలాగే ఉన్నాయని... వీటి కోసం ఓ స్టూడెంట్ లీడర్ ఏం చేసాడు అనేది ఈసినిమాలో చూపించనున్నారు కొరటాల అంటూ ప్రచారం జరుగుతుంది. మరి.. ప్రచారంలో ఉన్న కథ నిజమేనా..? కాదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments