Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ ఫ్యాన్స్‌లో టెన్షన్ టెన్షన్, అసలేమైంది?

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (20:46 IST)
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఆర్య సినిమాను అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఆర్య సినిమా బన్నీకి స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెస్తే సుకుమార్‌కు క్రియేటివ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసింది. 
 
అయితే ఆర్య సినిమా అంచనాలను అందుకుంటే ఆర్య-2 సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. కథలో చిన్నచిన్న లోపాలు ఆర్య-2 సినిమా పాలిట శాపంగా మారాయి. పుష్ప సినిమా విషయంలో కూడా ఆర్య-2 పరిస్థితే రిపీట్ అవుతుందేమోనని ఆందోళనలో ఉన్నారు బన్నీ ఫ్యాన్స్.
 
పుష్ప పాటలు హిట్ అయినా సినిమాలోని కథ ఏవిధంగా ఉంటుందని అల్లుఅర్జున్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోతున్నారట. ఇప్పటికే పుష్ప పార్ట్ -1 90శాతం షూటింగ్ పూర్తి కావడంతో ఆగస్టు 13వ తేదీ మొదటి భాగాన్ని రిలీజ్ చేయాలని మైత్రీ మూవీమేకర్స్ భావిస్తున్నారట. ఆగష్టు నెల నాటికి దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందన్నది తెలిసిందే.
 
బన్నీకి జోడికి ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా పుష్ప పార్ట్-2లో బన్నీ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారని ఊరమాస్ సినిమా తొలి పార్ట్ భారీ హిట్ అవుతుందని ఆశతో యూనిట్ ఉందట. సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతుండడంతో పుష్ప సినిమా కూడా హిట్ అవుతుందని ఒకవైపు ఆనందంతో మరోవైపు టెన్షన్లో ఉన్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments