Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయ్యాక కూడా మా నాన్నతోనే కలిసి వుంటానని నా భార్యకు కండిషన్ పెట్టా: అల్లు అర్జున్

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (14:38 IST)
అల వైకుంఠపురంలో ప్రమోషనల్  ప్రోగ్రామ్ ఈవెంట్లో అల్లు అర్జున్ ఎమోషనల్‌గా మాట్లాడారు. తన తండ్రి అరవింద్ గురుంచి చెపుతూ భావోద్వేగానికి గురయ్యాడు. అంతేకాదు కంటతడి పెట్టాడు. ఇండియాలోనే నెంబర్ వన్ ప్రొడ్యూసర్‌గా ఉన్న తన తండ్రిపై దుష్ప్రచారం ఎక్కువగా జరిగిందని చెప్పుకొచ్చాడు. 
 
మార్కెట్లో 10 రూపాయల వస్తువును నాన్న 7 రూపాయలకు కొనడానికి ట్రై చేస్తాడు. అంతేకానీ 6 రూపాయలకు ఇస్తానన్నా కానీ తీసుకోడు అని చెప్పాడు. ఇప్పటివరకు ఎప్పుడూ తన తండ్రి గురించి మాట్లాడలేదంటూ ఆయనలాగా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవకు పద్మశ్రీ పురస్కారానికి అర్హుడని ఆయనకు అవార్డు దక్కేలా చూడాలని రెండు తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలను కోరాడు అర్జున్. 
 
తన భార్యతో పెళ్ళికి ముందు తాను పెట్టిన ఒకే ఒక కండిషన్, పిల్లల పుట్టాక కూడా తన తండ్రితో పాటు కలిసి ఉంటానని చెప్పడమేనని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఇక తమ అభిమాన హీరో అల్లు అర్జున్ స్టేజ్ మీదనే కంటతడి పెట్టుకోవడంతో ఆయన అభిమానులు కూడా తల్లడిల్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments