Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ ఫ్యాన్స్‌కు ప్రత్యేకం... ఆఫర్లు ప్రకటించిన ఎయిర్‌టెల్

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (11:19 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం దర్బార్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థగా ఉన్న ఎయిర్‌టెల్ సంస్థ రజినీ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రటించింది. 
 
దర్బార్ మూవీ టిక్కెట్లను గెలుచుకోవడంతోపాటు ఆ మూవీ నటీనటులను కలిసే బంఫర్‌ ఆఫర్‌ను ఎయిర్‌టెల్‌ అందిస్తున్నది. అందుకుగాను ఎయిర్‌టెల్‌ కస్టమర్లు దర్బార్‌ క్విజ్‌లో పాల్గొనాలి. ఎయిర్‌టెల్‌ కస్టమర్లు తమ ఫోన్లలో ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీం యాప్‌ నూతన వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక అందులో వచ్చే దర్బార్‌ క్విజ్‌లో పాల్గొని సమాధానాలు చెబితే చాలు.. విన్నర్లు దర్బార్‌ మూవీ టిక్కెట్లను గెలుచుకోవచ్చు. 
 
అలాగే ఆ మూవీ నటీనటులు, ఇతర సిబ్బందిని కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ ఆఫర్‌ కేవలం ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక 'దర్బార్‌' బ్రాండెడ్‌ సిమ్‌ పౌచ్‌లను కూడా లిమిటెడ్‌ ఎడిషన్‌ రూపంలో ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేసింది. వీటిని కొనుగోలు చేసిన వారికి అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోమింగ్‌, హై స్పీడ్‌ డేటా ఉండే ప్రీపెయిడ్‌ ప్యాక్‌లను అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

ఖాళీ మద్యం బాటిల్ ఇస్తే రూ.20 : కేరళ సర్కారు నిర్ణయం

Jubilee Hills: మూడు సర్వేలు, 3 అభ్యర్థులు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఆ అభ్యర్థి ఎవరు?

అత్యవసర పరిస్థితి ఉంటే జగన్ ఇలా తిరుగుతుంటాడా?... పైలట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు?

మోహన్ బాబు - మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments