అల్లరి నరేష్ కొత్త సినిమా పేరు 12A రైల్వే కాలనీ

దేవీ
సోమవారం, 17 మార్చి 2025 (16:51 IST)
Allari Naresh
అల్లరి నరేష్ బోల్డ్ అండ్ యూనిక్ ప్రాజెక్ట్స్ తో అలరిస్తున్నారు. తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ మరొక ఎక్సయిటింగ్ డిఫరెంట్ మూవీ అవుతుందని హామీ ఇస్తుంది. పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్, ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు షోరన్నర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నాని కాసరగడ్డ దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ ని నిర్వహిస్తారు.
 
ఈరోజుఈ సినిమా టైటిల్‌ను ఒక స్పైన్ చిల్లింగ్ టీజర్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 12A రైల్వే కాలనీ అని ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు, టీజర్ సినిమా కథను గ్లింప్స్ లా ప్రజెంట్ చేసింది. అల్లరి నరేష్ ఒక కిటికీ దగ్గర నిలబడి, ఆలోచనలో, ధ్యాన ముద్రలో కనిపించడంతో టీజర్ బిగెన్ అవుంతుంది. వైవా హర్ష వాయిస్ ఓవర్‌లో కొంతమందికి మాత్రమే ఆత్మలు ఎందుకు కనిపిస్తాయో, రాబోయే అతీంద్రియ అంశాలను ఎందుకు సూచిస్తుందో ప్రశ్నిస్తుంది.
 
టీజర్ వింతైన, కలవరపెట్టే సంఘటనలు ఎక్సయిటింగ్ గా వున్నాయి, ప్రతి పాత్ర కూడా అనుమానాస్పదంగా వుంది. అల్లరి నరేష్ పాత్ర ఒకరిని షూట్ చేసి నవ్వడం ప్రేక్షకులను ఆ పాత్ర గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా వుంది. 
 
అల్లరి నరేష్ డిఫరెంట్ షేడ్స్‌తో మరో ఆసక్తికరమైన పాత్రను పోషించగా, పోలిమేరా సిరీస్ ఫేమ్ డాక్టర్ కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటించారు. సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా మధుమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో క్యాలిటీ వర్క్ టైటిల్ టీజర్‌లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

ఏబీసీ క్లీన్‌టెక్, యాక్సిస్ ఎనర్జీతో రూ. 1,10,250 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments