Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ

Allari Naresh as  Bacchal Malli

డీవీ

, శుక్రవారం, 20 డిశెంబరు 2024 (08:07 IST)
Allari Naresh as Bacchal Malli
నటీనటులు: అల్లరి నరేశ్, అమ్రుత అయ్యర్, రోహిణి, రావురమేష్, అచ్చుత్ కుమార్, వైవా హర్ష, ప్రవీణ్ తదితరులు
సాంకేతికత: కెమెరా: రిచర్డ్ ఎం. నాథన్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, నిర్మాతలు: బాలీజీగుప్త, రాజేష్ తండా, కథ, మాటలు,దర్శకత్వం : సుబ్బు మంగాదేవి. విడుదల.. శుక్రవారం 20వతేదీ.
 
అల్లరి నరేష్ కు నాంది సినిమా తర్వాత సీరియస్, రగ్గెడ్ పాత్రలు చేయాలంటే ఇష్టపడుతున్నారు. అందులో భాగంగా 1985లో ఉత్తరాంధ్రలో బచ్చల మల్లి అనే వ్యక్తికథతో దర్శకుడు కథను రాసుకున్నాడు. సీరియస్ గా సాగే ఈ పాత్ర, కథ ప్రేక్షకులకు ఎలా మెప్పించాలని దర్శకుడు అనుకున్నాడో తెలుసుకుందాం.
 
కథ: 
ఉత్తరాంధ్రలోని ఓ ప్రాంతంలో తండ్రి జయరామ్, తల్లి రోహిణి కుమారుడైన మల్లి చిన్నతనంనుంచి చురుకైనవాడు, తెలివిగలవాడు. టెన్త్ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ లో పాసయి ఊరిలో గర్వంగా చూసేలా చేస్తాడు. తండ్రంటే మమకారం. అలాంటి తండ్రి చేసిన ఓ తప్పిదం మల్లి మనసులో తీవ్రంగా నాటుకుంటుంది. దాంతో తండ్రంటే ద్వేషంతో రగిలిపోతూ ఫ్రెండ్స్ ద్వారా చెడు అలవాటుకు గురవుతాడు. కాలేజీ కూడా మానేసి తనకున్న ట్రాక్టర్ నడుపుతుంటాడు. ఊరిలోనే గోనెసంచులు కుట్టే పనిని చేస్తుంటాడు. తాగుడుకు అలవాటై మూర్షుడిలా ఊరిలో ప్రతీదానికి గొడవకు దిగుతాడు. అలాంటి వాడికి కాలేజీ అమ్మాయి అమ్రుత అయ్యర్ పరిచయంకావడం, ఆమె అన్నమాటలకు జ్నానోదయం కావడంతో ఆమె ప్రేమిస్తున్నట్లు డైరెక్ట్ గా చెప్పేస్తాడు. కానీ ఆమె మల్లినుంచి తప్పించుకుని తిరుగుతుంది.  కానీ ఆమెకోసం మల్లి ఏం చేశాడు? ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఏమిటి? మల్లి తన తండ్రిపై ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు? అన్నది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఓ ఊరిలో మూర్ఖుడిలా రౌడీలా ముందూ వెనుక ఆలోచించకుండా వుండే వ్యక్తి కథ. బచ్చల అనే ఇంటిపేరుతో మల్లి అనే తన పేరుతో 1985లో ఓ ఊరిలో జరిగిన కథను తీసుకుని దర్శకుడు సినిమాగా తీయడం, నిర్మాతలు ముందుకు రావడం సాహసమే అని చెప్పాలి. ఇందులో పాత్రలు, సన్నివేశాలు అనేవి కొత్తగా ఏమీ వుండదు. ఎందుకంటే పాతకాలం నాటి కథ కాబట్టి. వచ్చే సన్నివేశాలు మల్లి ప్రేమకథ అంతా చాలా సినిమాల్లో చూపించనవే.
 
ఇంటర్ వెల్ ముందు వచ్చే పాత్రలో ట్విస్ట్ వుంటుంది. కానీ ఆ పాత్ర కథనం కూడా తర్వాత ఆసక్తి కలిగించదు. ముగింపు కూడా అంతే. ఎందుకంటే కథలో సరైన పట్టు లేదు. సినిమాలో అల్లరి నరేశ్ నటన, కొన్ని మలుపులు మినహా పెద్దగా కనెక్ట్ అయ్యే అంశాలు లేవు. ప్రధాన లోపాలు మాత్రం చాలా వున్నాయి. రక్తికట్టించని కథ, కథనం, బలంలేని భావోద్వేగాలు. వెరసి సినిమాను నీరసపరుస్తాయి. ప్రేక్షకుడికి బోర్ కొట్టించేలా వుంటాయి.
 
పెళ్లిచూపులు సీన్ ఒకటి భిన్నంగా వుంటూ ఎంటర్ టైన్ చేస్తాయి. రావురమేస్ పోలీస్ పాత్రలో కూడా ఎంటర్ టైన్ మెంట్ కనిపిస్తుంది. మిగిలిన పాత్రలు బాగానే చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, రిచర్డ్ కెమెరా పనితం పర్వాలేదు. కావేరీ పాత్రలో అమ్రుత అయ్యర్ పాత సినిమాల్లో చాలా చూసినట్లుంది. అల్లరి నరేశ్ నటనను మరోసారి చూపించాలని చేసిన ప్రయత్నంమినహా ఈ సినిమా ఆడియన్ కు పెద్దగా రుచిచందనే చెప్పాలి.
రేటింగ్ 2/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ