ముఫాసా (మహేష్ బాబు), టాకా (సత్యదేవ్), రఫీకీ (కొండముచ్చు) సరబీ, కియారా (బుల్లి సింహం)
దర్శకుడు: బ్యారీ జెన్ కిన్స్, నిర్మాణ సంస్థ: డిస్నీ విడుదల: 20-12-2024
ఇంతకు ముందు వచ్చిన లయన్ కింగ్‌లో ముఫాసా, సింబా కథతో సాగింది. ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌గా ముఫాసా ది లయన్ కింగ్ సినిమాను తీశారు. ఇందులో ముఫాసా రాజుగా ఎలా మారాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? అన్నది ఉంటుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
సింబా కూతురు కియారాకి (బుల్లి సింహం). తండ్రి బయటకు వెళుతూ జాగ్రత్తగా చూడమని పక్షి, పంది (బ్రహ్మానందం), మరో బుల్లి జంతువు (అలీ)కి చెప్పి వెళతాడు. వారు ఓ కథను చెబుతుండగా, ఉరుములు మెరుపులు రావడంతో కియారా భయపడుతుంది. అప్పుడు రఫీకి (కొండముచ్చు) బయటనుంచి వచ్చి ధైర్యం చెబుతూ ముఫాసాకు కియారా తాత ముఫాసా (మహేష్ బాబు వాయిస్ ఓవర్) కథ చెబుతాడు.
ముఫాసా అమ్మ (లేడి సింహం) ఆకాశంలో వెలుతురు కనిపించే చోటికి కొండలు దాటుకుంటూ వెళితే మిలేలే అనే స్వర్గం లాంటి అందమైన రాజ్యం వుంటుందని విని కలలు కంటూ ఉంటాడు. ఓరోజు బాగా వరదలు రావడంతో తల్లిదండ్రులనుంచి విడిపోయి ఓ కొత్త ప్రదేశానికి వస్తాడు. అది టాకా (సత్య దేవ్ వాయిస్ ఓవర్) ఉన్న రాజ్యాం. నీటిలో వున్న ముసాఫాను మొసలినుంచి రక్షిస్తాడు టాకా. మన జాతివాడు కాదని, బయట వాడిని నమ్మకూడదని టాకా తండ్రి ఇతన్ని అందరికీ ఆహారంగా చేస్తానంటాడు. టాకా తల్లి తాను కొడుకులా చూసుకుంటానని అంటుంది. టాకా కాస్త పిరికివాడు. భయస్తుడు కాబట్టి ముఫాసా తోడుగా వుంటే బాగుంటుందని తల్లి భావిస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆ పక్క ప్రాంతంనుంచి వచ్చిన ఓరోజు తెల్ల సింహాల గుంపు తల్లి మీద అటాక్ చేస్తే టాకా భయపడి పారిపోతాడు. కానీ ముఫాసా మాత్రం తల్లిని కాపాడతాడు. ఆపోరాటంలో తెల్ల సింహాల యువరాజును ముఫాసా చంపేస్తాడు. ఇది తెలిసిన తెల్ల సింహాల పెద్దరాజు ముఫాసాను చంపడానికి దాడిచేస్తారు. దీంతో వారి రాజ్యాన్ని వదిలి టాకా, ముఫాసా మిలేలే రాజ్యం వైపు పరుగులు తీస్తారు. ఈ ప్రయాణంలోనే శారభి అనే ఓ ఆడ సింహం వీరితో కలుస్తుంది. ఆ జర్నీలోనే రఫీకీ వీరికి తోడవుతుంది. మరోవైపు పక్షి కూడా వీరికి సూచనలు చేస్తుంది. ఇలా అందరూ బయలుదేరి మిలేలే రాజ్యానికి వెళ్ళే క్రమంలో జరిగిన సంఘటనల సమాహారమే మిగిలిన సినిమా.
సమీక్ష:
ముందు వచ్చిన ది లయన్ కింగ్ సినిమాలో సింబా కథ ఎక్కువగా ఉంటుంది. ముఫాసా రాజు.. అతని సోదరుడు స్కార్. సింహాసనం కోసం స్కార్ వేసే ఎత్తులు, కుయుక్తులకు సింబా తన రాజ్యం నుంచి పారిపోవాల్సి వస్తుంది. ఇక ముఫాసాలో సింహాలతో మిలేలే అనే ఊహాజనితమైన స్వర్గంలా కనిపించే ప్రాంతానికి వెళ్ళడం అనేది కీలకం. ఇందుకు సాంకేతికపరంగా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ మాయాజాలం కనిపిస్తుంది.
లయన్ కింగ్ అనేది పిల్లలు, పెద్దలకు బాగా నచ్చింది. మనుషుల జీవితాల్లోని కథను తీసుకుని జంతువులపై తీసింది. అందుకే ముఫాసా, సింబా పాత్రలతో అందరూ కనెక్ట్ అయిపోయారు. ఇక ఇందులో ముఫాసా అసలు రాజుగా ఎలా మారాడు? ముఫాసా గత చరిత్ర ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ టాకా అలియాస్ స్కార్ ఎవరు? స్కార్‌కు ఆ పేరు ఎందుకు వచ్చింది? అన్నది ఇందులో చూపించాడు.
ముఫాసా కథ కూడా మనుషుల జీవితాలను టచ్ చేసే కాన్పెప్ట్. టాకా లాంటి సోదరుడు వుండడం ముఫాసా ప్రేమలో పడితే అసూయతో రగిలిపోయి తెల్ల సింహాలతో చేయి కలిపి ముఫాసాను చంపాలను ప్లాన్ చేయడం వంటివి చూపించాడు కథ కొత్తగా లేకపోయినా మిలేలే ప్రపంచంలోకి మాత్రం ఆడియెన్స్‌ను తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
సంగీతం, సినిమాటోగ్రపీ హైలైట్ గా వుంది. ఇందులో ముఫాసా, ఆడసింహంపై పాటలు కూడా వున్నాయి. టాకా వీరి ప్రేమను చూసి అసూయపడేవిధంగా మరో పాట వుంది. ముఫాసాకు మహేఫ్ బాబు తెలుగు డబ్బింగ్ బాగానే వుంది. సెటైర్లు, పంచ్‌లతో సింహానికి బదులుగా మహేష్ బాబు కనిపిస్తాడు. టాకాలో సత్యవేద్, పంది పాత్రకు బ్రహ్మానందం, మరో జంతువుకు అలీ కనిపిస్తారు. టెక్నికల్‌గా హాలీవుడ్ స్టాండర్డ్స్ హైలైట్ గా వుందనే చెప్పాలి. ఇలాంటి సినిమా పిల్లలకు బాగా కనెక్ట్ అవుతుంది. అయితే పెద్దలకు సింబా అంత కనెక్ట్ అవుతుందో లేదో అనుమానమే. మల్టీప్లెక్సులు మాత్రం ముఫాసాకు దగ్గరవుతారు. మాస్ ప్రేక్షకులకు ఎలా వుంటుందో చూడాలి.