Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫియర్ మూవీతో వేదిక భయపెట్టిందా? ఫియర్ రివ్యూ

Advertiesment
Vedika-Fear

డీవీ

, శుక్రవారం, 13 డిశెంబరు 2024 (09:48 IST)
Vedika-Fear
నటీనటులు - వేదిక, అరవింద్ కృష్ణ, తమిళ జయప్రకాష్, పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు
సాంకేతికత: మ్యూజిక్ - అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ - ఐ ఆండ్రూ,లిరిక్స్ - కృష్ణ కాంత్, కొరియోగ్రఫీ - విశాల్, నిర్మాత - డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి, కో ప్రొడ్యూసర్ - సుజాత రెడ్డి, రచన, ఎడిటింగ్, దర్శకత్వం - డా. హరిత గోగినేని
 
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ చేసిన సినిమా "ఫియర్". సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని  రూపొందించారు. సినిమా పూర్తయి ట్రైలర్ విడుదలయ్యాక చాలా థ్రిల్ అంశాలతో ఆకట్టుకుంది. అయితే థియేటర్ రిలీజ్ కుముందే పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ముందుగా గత రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
తమిళ జయప్రకాష్, పవిత్ర లొకేష్ కు కవలపుత్రికలు. (వేదిక దిపాత్రాభినయం) చిన్నతంనుండి తన అక్క నిద్రపోయేముందు హార్రర్ సినిమాలు చూస్తూంది. చెల్లి భయపడుతూ వద్దన్నా అక్క పట్టించుకోదు. తల్లిదండ్రులకు విషయం చెప్పనీయదు. పెద్దయ్యాక చెల్లెలు భయం కూడా పెరుగుతుంది. ట్రీట్ మెంట్ కోసం మానిసక నిపుణులు డాక్టర్ అనీష్ దగ్గరకు తీసుకెళతారు. మానసికరోగుల ఆసుప్రతిలో ట్రీట్ మెంట్ ఇస్తుంటాడు. అయినా భయాన్ని పోగొట్టుకోదు. పైగా అక్కడ తన బాయ్ ఫ్రెండ్ సంపత్ (అరవింద్ కృష్ణ) గురించే అందరినీ అడుగుతుంది. సంపత్ అనేవాడు లేడు అంటూ డాక్టర్ ఎంత చెప్పినా వినదు. మరోవైపు సిటీలో అక్క అయిన వేదిక విలాసవంతమైన ఇంటిలో సాయాజి షిండే, సత్య కృష్ణ, మరో ఇద్దరితో కలిసి వుంటుంది. తనూ తరచూ భయపడుతుంది. ఇలా ఇద్దరూ ఎందుకు భయపడుతున్నారు? అసలు సాయాజి షిండే, సత్య కృష్ణ ఎవరు? సంపత్ అనే వ్యక్తి వున్నాడా? లేదా? వేదిక అంతలా భయపడడానికి అసలు కారణం ఏమిటి? అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 
సమీక్ష:
టైటిల్ లోనే కథ సారాంశం ఏమిటో దర్శకురాలు డా. హరిత చెప్పేశారు. అంతలా భయంతో వుండాలంటే తగిన ఆర్టిస్టు కావాలి. దానికి పూర్తి న్యాయం వేదిక చేసింది. కథనాన్ని నడిపే క్రమంలో రివర్స్ ఫ్లాష్ బ్యాక్ ఫార్మెట్ ను దర్శకురాలు అనుసరించారు. దానితో చైల్డ్ హుడ్ అంశాలు, వర్తమాన అంశాలు చూపిస్తూ ఆసక్తి క్రియేట్ చేశారు. కానీ ఒక్కోసారి గందరగోళం కలిగించేలా అనిపిస్తాయి. సీరియస్ గా భయపడే సన్నివేశం రాగానే వెంటనే చిన్ననాటి జ్నాపకాలు చూపిస్తూ వుండడం టెంపో మిస్ అయిందని ఫీలింగ్ మనకు వుంటుంది. కానీ ఇది హాలీవుడ్ సినిమాల శైలి. దానిని మెచ్చూర్డ్ గా చూస్తేనే అర్థంకాదు. ప్రతి సన్నివేశంలో ఏదో జరగబోతోంది. ఏదో వుందనేలా కొన్ని ట్విస్ట్ లతో ఆకట్టుకునేలా చేశారు. అలా మొదటి భాగం అయిపోతుంది. మొదటి భాగంవరకు  ప్రేక్షకుడు ఓపిక వహించాల్సివుంటుంది.
 
సినిమాకు సెకండాఫ్ ముఖ్యం. దానిని దర్శకురాలు బాగా డీల్ చేశారు. అసలు భయం అనే దానికి కన్ క్యూజన్ ఇస్తూ ట్విస్ట్ ను ముడి పిప్పే ప్రయత్నం చేశారు. కానీ అది కూడా మరో ట్విస్ట్ కు కొనసాగింపుగా చూపిస్తూ పూర్తిగా కథను చెప్పకుండా చేశారు. పతాకసన్నివేశంలో ట్రీట్ మెంట్ ఇస్తున్న దశలో వేదిక ఎవరికోసం భయపడుతుందో వారంతా కళ్ళముందు కనిపించడం, సీక్వెల్ వుందని ముగించడంతో మరో సస్పెన్స్ ను క్రియేట్ చేశారు. 
 
ఈ కథలో ప్రధానంగా తల్లిదండ్రులు పిల్లల్ని కంటికిరెప్పలా చూసుకోవాలి. వారు చెప్పే విషయాన్ని కూలంకషంగా గ్రహించాలి. తేలిగ్గా తీసుకుంటే పిల్లలు మానసికంగా ఎలా నలిగిపోతారో చూపించారు. సహజంగా ఇద్దరు అమ్మాయిలుంటే వారికి నచ్చిన అబ్బాయితో తన సోదరి మాట్లాడిన సహించదు. ఇలాంటి కొన్ని సన్నివేశాలు రియలిస్ట్ గా వున్నాయి. ఇందులో ప్రతీవారూ పాత్రమేరకు నటించారు. వేదిక ఒన్ మ్యాన్ షో అని చెప్పాలి. ప్రతీదీ భయపడేవారికి వైద్యపరిభాషలో మానిసకరుగ్మత అనే ఓ వ్యాధి అని చెప్పారు. కొద్దిమందికే వస్తుంది అనే చెప్పడం జరిగింది. దానిని రెండో భాగంలో ఎలా చూపిస్తారో చూడాలి.
 
ఇక సాంకేతికంగా ఆండ్రూ కెమెరా పనితంతోపాటు అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సన్నిశేపరంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. భయపెట్టే సన్నివేశాలకు శబ్దాన్ని బాగా క్రియేట్ చేశాడు. ఎడిటింగ్ కూడా దర్శకురాలే కనుక ఈ సినిమాను ఒకే భాగంలో చూపిస్తే ఆడియన్స్ థ్రిల్ ఏమిటో తెలిసేది. ఓటీటీకి మంచి కథావస్తువులాంటి సినిమా ఇది. రేపు విడుదలకానున్న ఫియర్ ఎంతమేర ఆదరణ పొందుతుందో చూడాలి.
రేటింగ్ : 2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గొడవలు పక్కనబెట్టి 'బైరవం' షూటింగుకు వెళ్లిన మంచు మనోజ్!!