కుటుంబ గొడవలతో ప్రముఖ సినీ హీరో మంచు మోహన్ బాబు కుటుంబం గత మూడు రోజులుగా వార్తల ప్రధాన శీర్షికల్లో నిలించింది. తనకు, తన కుటుంబానికి హాని ఉందంటూ ఆయన కుమారుడు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మనోజ్ బాబుపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఒక చానెల్ ప్రతినిధిపై దాడి చేసిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. పోలీసుల సూచనలతో తన వ్యక్తిగత సిబ్బందిని, బౌన్సర్లను ఆయన బుధవారం సాయంత్రమే మంచు మనోజ్ వెనక్కి పంపించేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మంచు మనోజ్ వివాదాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు. తన తాజా చిత్రం బైరవం షూటింగుకు వెళ్లిపోయారు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.