Webdunia - Bharat's app for daily news and videos

Install App

పున్నుకు బాబా భాస్కర్, రాహుల్‌కి తమన్నా నచ్చలేదట.. మా మధ్య? (video)

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (17:49 IST)
బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగింజ్, కంటిస్టెంట్ పునర్నవి అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీతో చాలా విషయాలు చెప్పారు. పునర్నవి భూపాలం- రాహుల్ సిప్లిగంజ్.. ఈ బిగ్ బాస్ జంటకు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పునర్నవి-రాహుల్ మధ్య ప్రేమాయణం జరుగుతోందని.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
 
తాజాగా అలీతో సరదాగాలో భాగంగా తన ప్రేమాయణం గురించి పునర్నవి ఓపెన్ అయింది. తనను ప్రేమించిన వ్యక్తి చనిపోయినట్లు వెల్లడించి అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. ఆ వ్యక్తి తనకు క్లోజ్ ఫ్రెండ్ అని.. తనను చాలా ఇష్టపడ్డాడని కానీ శ్రీలంక బాంబు పేలుడులో చనిపోయాడని తెలిపింది.

అతను తన మనసుకు బాగా దగ్గరైన వ్యక్తి అని.. మనిషి ఉన్నపుడు విలువ తెలియదని.. అతను తనకో జ్ఞాపకంగా మిగిలిపోయాడని.. అతను లేడనేసరికి కుంగిపోయానని చెప్పింది.
 
చిన్నప్పుడు తన కజిన్‌ని బెదిరించానని.. అతని ఇంటి ముందుకు వెళ్లి రా బయటికి అన్నానని చెప్పింది. ఏదో ఆట వస్తువు తీసుకెళ్తే కజిన్‌తో నువ్వే నేనో తేలిపోవాలి రా బయటికి అన్నానని తండ్రి చెప్పేవారని పున్ను చెప్పుకొచ్చింది. అందుకే రౌడీ లేడీ, ఇక బిగ్ బాస్ హౌస్‌లో లేడీ మోనార్క్ అనే పేర్లు వచ్చేశాయని పునర్నవి తెలిపింది. 
 
రాహుల్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్‌లో తనకు పున్ను, వరుణ్, వితికల వల్లే ట్రోఫీ గెలిచానని.. శ్రీముఖితో తనకు ఎలాంటి వివాదాలు లేవని చెప్పింది. ప్రేమాయణంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను రాహుల్, పునర్నవిలు కొట్టిపారేశారు. 
 
తామిద్దరం మంచి స్నేహితులమేనని రాహుల్, పున్ను క్లారిటీ ఇచ్చేశారు. బిగ్ బాస్‌ హౌస్‌లో తనకు నచ్చని వ్యక్తి బాబా భాస్కర్ అని.. నచ్చిన వ్యక్తి రాహులేనని పున్ను వెల్లడించింది. అలాగే రాహుల్ కూడా తనకు బిగ్ బాస్ హౌస్‌లో తమన్నా తనకు నచ్చలేదని.. పున్నునే నచ్చిన వ్యక్తి అంటూ కామెంట్స్ చేశాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాట తప్పిన జూనియర్ ఎన్టీఆర్.. బోరున విలపిస్తున్న ఓ తల్లి!!

Mohan Babu: మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

Seethakka: అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డా.. జై భీమ్‌కు అలాంటి గౌరవం లభించలేదు..

గాంధీ భవన్‌కు వెళ్లిన అల్లు అర్జున్ మామ.. పట్టించుకోని దీపా దాస్ మున్షి (video)

Sandhya Theatre stampede: రేవంత్ రెడ్డి కామెంట్లతో ఏకీభవిస్తా, బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments