Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీ- పెళ్లికాని పురుషులకు మాత్రమే

Advertiesment
Indian Navy Recruitment 2019
, సోమవారం, 18 నవంబరు 2019 (12:52 IST)
ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఇప్పటికే నేవీలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఓ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం మరో 400 సెయిలర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. మెట్రిక్ రిక్రూట్ అక్టోబర్ 2020 బ్యాచ్‌లో షెఫ్, స్టివార్డ్, హైజినిస్ట్ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు ఇండియన్ నేవీ వెల్లడించింది. 
 
ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.  https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. దరఖాస్తుకు 2019 నవంబర్ 28 చివరి తేదీ అని ఇండియన్ నేవీ ప్రకటించింది. 
 
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఐఎన్ఎస్ చిల్కాలో 2020 అక్టోబర్ నుంచి 15 వారాల పాటు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది. పెళ్లికాని పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి.
 
మొత్తం ఖాళీలు- 400
విద్యార్హత- మెట్రిక్యులేషన్
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 23.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొందరు దేవుళ్లు - దేవతలుగా ఊహించుకుంటున్నారు : సంజయ్ రౌత్