Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలీ... ఇప్పుడు నీకు ఇది అవ‌స‌ర‌మా..?

Webdunia
బుధవారం, 15 మే 2019 (21:28 IST)
అలీ ఓ వైపు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూనే మ‌రోవైపు రాజ‌కీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నాడు. ఆయ‌న య‌మ‌లీల సినిమాతో హీరోగా ఓ వెలుగు వెలిగిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా సినిమాలు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ హీరోగా సినిమా చేస్తున్నాడు. అలీ హీరోగా పెదరావూరు ఫిలిం సిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన జంధ్యాల మార్క్ కామెడీ సినిమా 'పండుగాడి ఫోటోస్టూడియో'.
 
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు దిలీప్ రాజా చిత్ర విశేషాల‌ను తెలియ‌చేస్తూ... 'స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు ఒకే చేసిన కథ ఇది."వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది" అనేది ఈ చిత్ర క్యాప్షన్. ఈ చిత్రంలో హీరోకు 40 ఇయర్స్ వచ్చేవరకు పెళ్లి కాదనే నాగ దేవత శాపం ఉంటుంది. ఆ క్రమంలో హీరోయిన్ కంచు కనకరత్నం పరిచయం జరగడం, ఆమెతో ప్రేమలో పడటం మరో పక్క శాపం వల్ల జరిగే పరిణామాలే ఈ చిత్ర కథాంశం. 
 
 
పూర్తి హాస్య భరిత చిత్రమిది. 1150 చిత్రాల్లో నటించిన అలీ గారు ఈ చిత్రంలో హీరోగా అద్భుతమైన నటనని ప్రదర్శించారు. హీరోయిన్‌గా రిషితను పరిచయం చేస్తున్నాం. కుటుంబ సభ్యులతో కడుపుబ్బా నవ్వుకునేలా పండుగ ఫోటో స్టూడియో సినిమా రూపొందించామన్నారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, బాబు మోహన్, సుధ, జీవ, శ్రీలక్ష్మి, రామ్, జగన్ లాంటి సీనియర్ నటులతో పాటు విలక్షణమైన పాత్రల్లో సందీప్ రాజా, టీనా చౌదరి తొలి పరిచయం చేస్తున్నాం. జాన్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అని అన్నారు. 
 
ఐతే... అలీ హీరోగా సినిమా అన‌గానే... అలీ ఇప్పుడు నీకు ఇది అవ‌స‌ర‌మా అంటున్నారు కొంతమంది జనం. మ‌రి... అలీ ఏమంటారో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments